Salaar నుంచి తప్పుకున్న శృతి హాసన్: ప్రభాస్ మాత్రం అప్పటి వరకూ బుక్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని పాన్ ఇండియా సినిమాలను అందించిన ఈ హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడు ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇక, ప్రస్తుతం అతడు నటిస్తోన్న సినిమాల్లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'సలార్' ఒకటి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
పవర్‌ఫుల్ కాంబోలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'సలార్' మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే ప్రారంభంలోనే మొదలెట్టారు. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో, రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేశారు. వీటిలో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను కూడా తీశారు. అలాగే, మిగిలిన నటీనటుల పైనా ఎన్నో భారీ బడ్జెట్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక, ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.

హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'సలార్' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె 'ఆద్య' అనే జర్నలిస్ట్ పాత్రను చేస్తోంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండే ఈ రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను శృతి హాసన్ తాజాగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ వరకూ జరగనుందని తెలిసింది. అప్పుడే ఈ సినిమా నుంచి ప్రభాస్ పార్ట్ కూడా పూర్తి అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తోన్న 'సలార్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2023 సెప్టెబర్ 28న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











