Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా శుభలేఖలు ట్రైలర్
ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం 'శుభలేఖ+లు'. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్లోనూ ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫర్స్‌తో వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకుని గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా రెండో ట్రైలర్‌ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రిమిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు విద్యాసాగర్, జనార్ధన్, బెల్లం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ... ఇటీవలే విడుదలైన మా ట్రైలర్ కిగాని, టీజర్‌కిగాని ఇంత అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇండస్ర్టీలో ఉన్న పెద్దలందరూ చూసి తమ మాటల్లో మంచి పోజిటివ్ ఎనర్జీని అందిస్తున్నారు. ఇంత మంది ప్రముఖుల ఆదరణ ఈ సినిమాకి లభించడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ట్రైలర్‌ని మేము అడిగిన వెంటనే త్రివిక్రమ్‌గారు విడుదల చేయడం చాలా సంతోషం ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. .
నటీనటులుః శ్రీనివాస్‌సాయి, ప్రియవడ్లమాని, దీక్షశర్మరైనా, ఇర్ఫాన్, సింధు, తిరువీర్, వంశీరాజ్, మోనాబేద్రె, అప్పాజిఅంబరీష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలుః విద్యాసాగర్, జనార్ధన్ ఆర్.ఆర్, కథ-మాటలుః జనార్ధన్ ఆర్.ఆర్-విస్సు, కథాసహకారంఃసి.విద్యాసాగర్, స్క్రీన్‌ప్లే-డైరెక్షన్ శరత్నర్వాడే, సంగీతంః కె.యం.రాధాక్రిష్టన్, డైరెక్షన్ ఆఫ్ ఫొటోగ్రఫీః యస్ .మురళీమోహన్‌రెడ్డి, ఆర్ట్‌డైరెక్టర్ః బ్రహ్మకడలి, ఎడిటర్ఃమధు, కొరియోగ్రఫీః చంద్రకిరణ్, పి.ఆర్.ఓః పులగం చిన్నారాయణ, వీరబాబు బాసిశెట్టి.