భర్తతో విడాకులు.. మళ్లీ ప్రేమలో పడతానేమో.. శ్వేత బసు సెన్సేషనల్ కామెంట్స్
ఎక్కడా.. అంటూ డిఫరెంట్ మ్యానరిజంతో డైలాగ్ చెప్పి కొత్త బంగారు లోకంలో మెరిసింది శ్వేతా బసు ప్రసాద్. ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా శ్వేత బసు ప్రసాద్‌కు ఓ గుర్తింపును తీసుకొచ్చింది. అటుపై చేసిన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేక పోవడం, సెక్స్ రాకెట్‌లో పట్టుబడటం వంటి అంశాలు శ్వేతాను వార్తల్లో నిలిచేలా చేశాయి. ఆ మధ్య దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతా హాయిగా జరిగిపోతుందనే సమయంలో ఆమెకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది.
ప్రేమ పెళ్లి..
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా రోహిత్ వర్క్ చేస్తున్నప్పుడు శ్వేతకు పరిచయమవడం, తర్వాత ప్రేమ, పెళ్లి వయా విడాకుల వరకు దారి తీసింది. 2018 డిసెంబర్ 13న శ్వేతా, రోహిత్ పూణెలో వివాహం చేసుకున్నారు. ఏడాదికే వీరి వివాహా బంధం ముచ్చట తీరి పోయింది.

వివాహా బంధానికి ముగింపు..
వివాహా బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మేం చట్టపరంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం కానీ.. భార్యాభర్తల కంటే ముందు నుంచి తాము మంచి స్నేహితులం. అతడు అద్భుతమైన దర్శకుడు. ఏదో ఒకరోజు మళ్లీ కలిసి పనిచేస్తామన్న నమ్మకముంది. మేం ఐదేళ్లుగా ఎంతో ప్రేమగా, నిజాయితీగా అనుబంధాన్ని కొనసాగించామ'ని పేర్కొంది

అసంపూర్తిగా ఉన్న పుస్తకం..
ఇంకా ఆ పోస్ట్‌లో.. ‘రోహిత్, నేను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకుంటున్నాం. ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవలేమని, అంతమాత్రాన ఆ పుస్తకం చెడ్డది కాదని, తమ వైవాహిక జీవితం కూడా ఓ అసంపూర్ణ పుస్తకం లాంటిదే' అంటూ వేధాంత ధోరణిని ఎత్తుకుంది.

మళ్లీ ప్రేమలో పడతానేమో..
వివాహా బంధానికి మధ్యలో స్వస్తి చెప్పిన శ్వేతా బసును మళ్లీ ప్రేమలో పడతారా? అని ప్రశ్నించగా.. మళ్లీ ప్రేమలో పడటానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్‌పైనే ఉందని చెప్పుకొచ్చింది. ఈ సమాధాన్ని బట్టి చూస్తే మళ్లీ ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలైతే ఉన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











