డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో ఆకట్టుకొంటున్న రాణి మూవీ.. శ్వేతా వర్మ నటనకు ప్రశంసలు

టాలీవుడ్‌లో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం రాణి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన అమెజాన్ ఓవర్సీస్, మ్యాక్స్ ప్లేయర్ లాంటి పలు ఓటీటీ‌లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.
మనోహరి ఆర్ట్స్, నజియా షేక్ ప్రొడక్షన్స్ పతాకంపై రాఘవేంద్ర దర్శకత్వంలో రూపొందింది. కిషోర్ మారిశెట్టి, నజియా షేక్ నిర్మించారు. శ్వేత వర్మ, ప్రవీణ్ యండమూరి, కిషోర్ మారిశెట్టి కీలక పాత్రలను పోషించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్, నువ్వు తోపురా డైరెక్టర్ హరిబాబు,హీరో సుధాకర్ కోమాకుల ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

 Shweta Varmas Rani

నటుడు ప్రవీణ్ యండమూరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రాణికి అపోజిట్‌గా శివ క్యారెక్టర్ చేశాను. ఈ చిత్రం తెలుగు,హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. రెండేళ్లుగా మేము పడ్డ కష్టమంతా ఈ రోజుతో రిలీఫ్ అయ్యింది. ఎయిర్‌టెల్, హంగామా, ఎంఎక్స్ ప్లేయర్, వి.ఐ.ఎక్స్, అమెజాన్ ఓవర్ సీస్లో ఈ సినిమాను విడుదల చేశాం అని తెలిపారు.

హీరోయిన్ శ్వేతావర్మ మాట్లాడుతూ.. రాణి సినిమా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఈ చిత్రంలో నేను నాలుగు వెరియేషన్స్ పాత్రలు పోషించే అవకాశం కల్పించారు. తెలుగు,హిందీ భాషల్లో డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేశాం అన్నారు.

చిత్ర దర్శకుడు రాఘవేంద్ర మాట్లాడుతూ.. 2014లో ఇండస్ట్రీకి వచ్చిన నేను రెండు షాట్ ఫిలిమ్స్ చేశాను. 2017 నుంచి రాణి కథ రాసుకొని చాలామందికి కథ చెప్పాను. మారిశెట్టి నజియా షేక్ ల సహకారం తో ఈ సినిమా పూర్తి చేశాం. ప్రస్తుతం సమయంలో థియేటర్ కంటే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తే బాగుంటుందని రాజీవ్ గారి సపోర్ట్‌తో ఈ మూవీని ఎయిర్‌టెల్, హంగామా, MX ప్లేయర్, VIX, అమెజాన్ ఓవర్సీస్‌లో ఈ సినిమాను విడుదల చేశాం అన్నారు.

 Shweta Varmas Rani

చిత్ర నిర్మాత నాజియా షేక్, కిషోర్ మారిసెట్టి మాట్లాడుతూ .. మూడు ఏళ్లుగా ఈ మూవీపై వర్క్ చేశాం. దర్శకుడు కథ చెప్పగానే నచ్చి నాజియా షేక్ ప్రొడ్యూసింగ్ హౌస్ నుంచి రాణి మూవీ చేయడం జరిగింది. మిడిల్ క్లాస్ అమ్మాయి మదర్ చనిపోయాక ఫాదర్‌తో ఎలా సమస్యలు ఎదుర్కొందో అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కింది ఈ మూవీ. ఈ మూవీ అందరికీ రీచ్ అవ్వాలని అన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేశామని అన్నారు.

కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ... కోటి రూపాయలతో ఓ బిజినెస్ పెట్టవచ్చు. కానీ ఓ మూవీని తీసి రెండు గంటల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం చాలా కష్టం. ఆ కష్టం వెనుక ఎన్నో కన్నీళ్లు, ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ కష్టం ఉంటుంది. సినిమాను ప్రేమించకపోయినా ఫర్వాలేదు కానీ కించపరిచే విదంగా మాట్లాడకుండా ఎంకరేజ్ చెయ్యాలని అందరినీ కోరుకొంటున్నానని అన్నారు.

నటుడు సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ... ఈ సినిమాను చిత్ర యూనిట్ అందరూ ప్యాసినెట్ గా వర్క్ చేశారు.నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ ఈ సినిమాను చూసి బాగుందని అన్నారు. ఇప్పుడున్న ఓ.టి.టి ఫిల్మ్ లలో ఈ మూవీ ద బెస్ట్ అవుతుంది అని అన్నారు.

నువ్వు తోపురా డైరెక్టర్ హరిబాబు మాట్లాడుతూ.. కిషోర్ నాకు 2008 నుంచి తెలుసు. తను ఈ సినిమా విడుదల చేయడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీని చూశాను. చాలా బాగుంది. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు వచ్చి నిర్మాతకు ఎక్కువ లాభాలు రావాలని అన్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
శ్వేతా వర్మ, ప్రవీణ్ యండమూరి, కిషోర్ మారిశెట్టి, అప్పాజీ అంబరీష, ధర్మ, మేక రామకృష్ణ, రాజశేఖర్ అన్నింగి, సురభి శ్రావణి, సుజాత, తదితరులు
బ్యానర్: మనోహరి ఆర్ట్స్. నజియా షేక్ ప్రొడక్షన్స్
నిర్మాత: కిషోర్ మారిశెట్టి, నజియా షేక్
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాఘవేంద్ర కటారి
మ్యూజిక్: శాండీ అడ్డంకి
సినిమాటోగ్రఫీ: .రామా మారుతి యం
ఎడిటర్: జెస్విన్ ప్రభు
పీఆర్వో: .మధు వి ఆర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X