Maayon మూవీ విజువల్ వండర్.. కట్టప్ప కొడుకు హీరోగా టాలీవుడ్‌కు పరిచయం.. రిలీజ్ ఎప్పుడంటే?
బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో మాయోన్ రూపొందింది. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర హక్కులను మూవీ మ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. "మాయోన్" చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ..
పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంతో అత్యంత సాంకేతిక విలువలతో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ మాయోన్. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. God Vs Science థీమ్‌గా, మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించడమే కాకుండా ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ మంజూరు చేసింది . ఈ సర్టిఫికేట్ మంజూరు చేసేటప్పుడు CBFC చిత్రానికి ఎలాంటి కట్స్‌ను సూచించలేదు.

ఇదిలా ఉంటే.. మయోన్ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అద్భతంగా ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాయోన్ చిత్రాన్ని సెల్యూలాయిడ్ వండర్‌గా మలిచారు. ఈ చిత్రంలో హీరో అర్జున్ పాత్రలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇందులో నటించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్‌కు మంచి భవిష్యత్త్ ఉంటుంది. మాయోన్ చిత్రాన్ని జూలై 7 తేదీన తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం అని అన్నారు.

నటీనటులు: సిబిరాజ్, తాన్య రవిచంద్రన్,రాధా రవి, కేఎస్ రవికుమార్, ఎస్ఏ చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి, అరాష్ షా తదితరులు
దర్శకత్వం: కిషోర్ ఎన్
నిర్మాత: మామిడాల శ్రీనివాస్, అరుణ్ మోజి మాణికం
పిఆర్వో: మధు వీఆర్


Click it and Unblock the Notifications











