అదితి, సిద్ధార్థ్ పెళ్లికి చిక్కుముడి.. ఆ విషయం తేలితే గానీ మ్యారేజ్!
లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది. దానికి సమాధానంగా వీళ్ళిద్దరి పెళ్ళికి ఓ మూవీ అడ్డుగా ఉంది అని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ మనం కూడా తెలుసుకుందాం పదండి.
చాలా కాలం నుంచి బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి, కోలీవుడ్ హీరో సిద్ధార్థ ప్రేమించుకుంటున్నారని వార్తలు వైరల్ కాగా, చిన్నచిన్న ట్విస్ట్ లు ఇచ్చి చివరికి ఎంగేజ్మెంట్ తో ఆ రూమర్లను నిజం చేశారు ఈ జంట.

ముందుగా అక్కడక్కడా కలిసి కనిపించి, ఆ తర్వాత వెకేషన్ లను ఎంజాయ్ చేసి, అనంతరం ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి చిన్నగా తమ రిలేషన్ గురించి అందరికీ హింట్ ఇస్తూ వచ్చారు సిద్ధార్థ, అదితి.
ఇక ఈ ఏడాది మార్చ్ లో తెలంగాణలోని ఓ ఆలయంలో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. వనపర్తి సంస్థానానికి అదితి తల్లిదండ్రులు చివరి పాలకులు. అందుకే అక్కడే ఉన్న 18వ శతాబ్దానికి చెందిన చరిత్ర కలిగిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
షూటింగ్ అని చెప్పి స్థానిక పూజారులను కూడా లోపలికి రానివ్వకుండా, తమిళనాడుకు చెందిన పూజారులను పిలిపించి మరీ ఈ వేడుకను నిర్వహించారు. కానీ ఎలాగోలా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో సిద్ధార్థ, అదితి పెళ్లి చేసుకున్నారు అని పుకారు షికారు చేసింది.
అయితే రెండు రోజులు సస్పెన్స్ లో ఉంచి ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అనే విషయాన్ని అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

రీసెంట్ గా హీరామండి వెబ్ సిరీస్ ప్రమోషనల్ కార్యక్రమంలో కనిపించిన అదితిని పెళ్లెప్పుడు అని ఓ ఫోటోగ్రాఫర్ ప్రశ్నిస్తే ఇంకా టైం ఉందని సమాధానం చెప్పింది ఈ బ్యూటీ. అయితే తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ కీలకపాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనే సిద్ధార్థ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే రీసెంట్ గా శంకర్ ఇండియన్ 2 మూవీని జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
దీంతో జూన్ నుంచి ఆగస్టు మధ్య సిద్ధార్థ పెళ్లికి ముహూర్తం ఇప్పటికే ఫిక్స్ అయిందని, మూవీ రిలీజ్ అయ్యాక ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ నడుస్తోంది.
కాగా వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. సిద్ధార్థ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకుని 2007లో విడాకులు ఇచ్చాడు. మరోవైపు అదితి గతంలోనే సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకొని 2012లో డివోర్స్ తీసుకుంది.


Click it and Unblock the Notifications











