తెలుగు, తమిళ ప్రేక్షకుల వార్.. పైత్యం అంటూ మధ్యలో సిద్దార్థ్.. పచ్చి బూతులతో హీరోపై ఫైర్
తమిళనాట సంచలనం సృష్టించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్పగా వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఈ ఫస్ట్ లుక్స్‌ను తమిళ సినీ ప్రేక్షకులు (స్టార్ హీరోల ఫ్యాన్స్) వీటిపై కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో తెలుగు ప్రేక్షకులు వారిపై మాటల దాడి చేస్తూ.. అక్కడి హీరోలను ఏకిపారేశారు.

నారప్పతో మొదలై..
నారప్ప ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో మొదలైన ఈ వార్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అచ్చం ధనుష్ లుక్‌లానే ఉందని తమిళ హీరోలకు పోటీ రాలేరంటూ.. #UnrivalledTamilActors అంటూ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. అయితే దీంట్లో ధనుష్ ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కొంతమంది అంటుంటే.. విజయ్ ఫ్యాన్స్ పనే అంటూ మరికొంత మంది అంటుండగా.. కాదు అజిత్ ఫ్యాన్సే ఇలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రెండు ఇండస్ట్రీల మధ్య గొడవగా..
నారప్పతో మొదలైన ఈ గొడవ.. రెండు ఇండస్ట్రీల మధ్య గొడవగా మారిపోయింది. తమిళ హీరోలను తెలుగు సినీ అభిమానులు ట్రోల్ చేస్తుండగా.. తెలుగు హీరోలను తమిళ సినీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఇలా గొడవ తీవ్ర స్థాయిలో పెరిగి UnrivalledTamilActors, TeluguRealHeroes అనే రెండు హ్యాష్ ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

మధ్యలో సిద్దార్థ్..
సినిమాల సంగతేమో గానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు సిద్దార్థ్. సరైన హిట్ చూసి దశాబ్దం గడుస్తున్నా.. మునుపటి ఫామ్‌ను తిరిగి తెచ్చుకోలేకపోతున్నాడు. పోనీ ఉన్నవాడు సైలెంట్‌గా ఉంటే పోయేది. ఇలాంటి ఫ్యాన్స్ వార్‌లో పైత్యం అంటూ సిద్దార్థ్ జోక్యం చేసుకున్నాడు. ఇక అసలే కాకమీదున్న తిక్క ఫ్యాన్స్ ఊరికే ఉంటారా.. నానా బూతులతో రెచ్చిపోయారు.
Recommended Video

పచ్చి బూతులతో..
ఎవరితోనూ ఎటువంటి వివాదాలు పెట్టుకోని వెంకటేష్ లాంటి హీరో, నారప్ఫ ఫస్ట్ లుక్‌పై తమిళులు మొదట ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారని అందువల్లే ఈ గొడవ మొదలైందని మధ్యలో నువ్వెందుకు వస్తున్నావంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక వెరైటీ వెరైటీ మీమ్స్‌తో సిద్దార్థ్‌ను ఏకిపారేస్తున్నారు. అయితే ఇది ధనుష్, అజిత్, విజయ్ ఫ్యాన్స్ చేసిన పని అని.. మొత్తం తమిళ ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











