రిలేషన్‌షిప్ వర్కవుట్ కాలేదు.. అందుకే ఫ్లాప్.. క్లారిటీ ఇచ్చిన సిద్దార్థ్

టక్కర్ సినిమాలో యాక్షన్ సీన్లు రాజీ పడకుండా దర్శకుడు చిత్రీకరించాడు. కొన్ని సందర్భాల్లో షాట్స్ తీయడంలో శంకర్ శిష్యుడు అనిపించుకొన్నాడు. హాలీవుడ్ చిత్రం టాన్స్‌పోర్టర్‌లోని యాక్షన్ సీన్ల లాంటి యాక్షన్ సీన్లు నా సినిమాలో ఉన్నాయనే విషయం నాకు గర్వంగా ఉంది. తప్పకుండా మంచి యాక్షన్ సినిమా అవుతుంది అని సిద్దార్థ్ చెప్పారు.

మహా సముద్రం నేను చాలా ఇష్టపడి, కష్టపడి సినిమా చేశాను. కానీ ఆ సినిమా ఆడకపోవడం చాలా బాధగా అనిపించింది. ఆ సినిమా హిట్ అవుతుందని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండేది. రిలేషన్‌షిప్స్ మీద వచ్చే కొన్ని సినిమాల్లో ఆ ఎమోషన్స్‌కు కనెక్ట్ కాకపోతే మంచి ఫలితాన్ని ఇవ్వవు. కానీ ఆ సినిమా విషయంలో నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. ఎందుకంటే కథ విని నచ్చిన తర్వాతే సినిమా చేశాను అని సిద్దార్థ్ చెప్పారు.

Siddharth

టక్కర్ సినిమా విషయంలో నాకు బాధ్యత పెరిగింది. ఈ సినిమా సక్సెస్ విషయంలో నాకు రెస్పాన్స్‌బిలిటి ఉంది. ఈ సినిమా మౌత్ టాక్ నుంచి సక్సెస్ వరకు నేను బాధ్యత తీసుకొన్నాను. ఇప్పటి వరకు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేయడం లేదు. ఫస్ట్ ఇలాంటి సినిమాతో పరీక్ష రాసిన ఫీలింగ్ కలుగుతుంది. దీని రిజల్ట్ ప్రభావం నా కెరీర్‌పై ఉంటుంది అని సిద్దార్థ్ అని చెప్పారు.

టక్కర్ సినిమా 90వ దశకంలో మంచి కమర్షియల్ సినిమా చూసినట్టు ఉంటుంది. నా నమ్మకం ఏమిటంటే.. ఈ సినిమా కమర్షియల్ మూవీగా నాకు సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమా సక్సెస్ ప్రభావం నా తదుపరి సినిమా బడ్జెట్, యాక్షన్ అంశాలపై ఉంటుంది. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్ లా చూసారు. మిమ్మల్ని నేను కంప్లీట్ డిఫరెంట్ చూపించబోతున్నానని దర్శకుడు కార్తీక్ జీ క్రిష్ చెప్పారని సిద్దార్థ్ తెలిపారు.

సినిమా పరిశ్రమలో ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తున్నది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి అని సిద్దార్థ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X