Director Yeshasvi: "ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉండి బతికిపోయాడు.. ఇక్కడుంటే అయిపోయేవాడే"
ఒక సినిమాను ప్రేక్షకులు ముందు వరకూ తీసుకు రావాలంటే అనేక మంది పని చేయాల్సి ఉంటుంది. అంతా కలిసి ఒక్కతాటిపై నిలబడితేనే చిత్రం బాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. డబ్బులతో పాటు పేరు కూడా దక్కుతుంది. అలాంటి సినిమా కోసమే అందరూ కష్టపడుతుంటే.. కొంత మంది మాత్రం కావాలని గొడవలు పెట్టుకుంటూ రచ్చ చేస్తుంటారు. అయితే తాజాగా ఇలాంటి వ్యవహారమే వెలుగులోకి వచ్చింది టాలీవుడ్ లో. సిద్దార్థ్ రాయ్ సినిమా డైరెక్టర్ యే ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా కనిపించిన కుర్రాడు దీపక్ సరోజ్.. హీరోగా మారి సిద్దార్థ్ రాయ్ అనే సినిమా చేశాడు. అయితే ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ వంటి వాళ్ల దగ్గర పని చేసిన యశస్వి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన అంటే రేపే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే సినిమా గురించి మాట్లాడడం కంటే ముందు డైరెక్టర్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడి షాక్ ఇచ్చారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా.. ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నారు. ఆయనే రథన్. చెన్నైలో ఉంటే అనేక అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించిన ఈయన... సిద్దార్థ్ రాయ్ సినిమాకు చాలా సమస్యలు తెచ్చిపెట్టాడని డైరెక్టర్ యశస్వి వివరించారు. ఇస్తానన్న సమయానికి పాటలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టాడని.. మాట్లాడితే చాలు గొడవలు పడి, పని మధ్యలో వదిలేస్తానంటూ ఇబ్బందులు పెట్టాడని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన చెన్నైలో ఉండిపోయి బతికిపోయాడు కానీ... ఇక్కడ ఉంటే మాత్రం చాలా గొడవలు అయిపోయేవి అంటూ తెలిపారు.
రథన్.. అనేక అద్భుతమైన సినిమాలకు సంగీతం అదించారు. ముఖ్యంగా అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలకు కూడా ఆయన మ్యూజిక్ అందించారు. అయితే అర్జున్ రెడ్డి సమయంలో కూడా రథన్ ఇలాగే ప్రవర్తించినట్లు ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలిపారు. రథన్ చాలా బెదిరించేవాడని.. ఏమైనా అంటే మధ్యలో సినిమా వదిలేస్తానని చెప్పేవాడని.. ఏం చేయలేక అలాగే ఉండిపోయానని గతంలో సందీప్ రెడ్డి వంగా వివరించారు.

తాజాగా డైరెక్టర్ యశస్వి కూడా అలాగే మాట్లాడడంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్.. ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇలా బహిరంగంగా చెప్పారంటే.. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టి ఉంటారో అర్థం అవుతుందని చాలా మంది చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా శుక్రవారం రోజు గ్రాండ్ గా విడుదల కాబోతున్న సిద్దార్థ్ రాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











