Siddhas Saga: ఆ అమ్మోరు తల్లే పంపించింది.. చివర్లో వచ్చే సీన్‌కు గూస్‌బమ్స్ గ్యారెంటీ

దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతూ.. తన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారాయన. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులను చూపిస్తూ డిజైన్ చేసిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

మెగా హీరోల కాంబోలో ‘ఆచార్య'

మెగా హీరోల కాంబోలో ‘ఆచార్య'

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఏమాత్రం తగ్గకుండా రాబోతుంది

ఏమాత్రం తగ్గకుండా రాబోతుంది

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివ సినిమాలన్నీ సందేశాత్మకంగానే ఉంటాయి. ఇప్పుడు 'ఆచార్య'ను కూడా అదే రీతిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య అయిన చిరంజీవి దాన్ని కంప్లీట్ చేస్తాడట. ఆ మిషన్ ఏంటి అనేది సినిమాలో హైలైట్ కానుందట.

అంచనాలకు తగ్గట్లుగానే బిజినెస్

అంచనాలకు తగ్గట్లుగానే బిజినెస్

చిరంజీవి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హిందీలోనూ రిలీజ్ కాబోతుంది.

పూర్తైనా ఆలస్యం.. అప్పుడు రిలీజ్

పూర్తైనా ఆలస్యం.. అప్పుడు రిలీజ్

'ఆచార్య' మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. దీంతో ఈ సినిమాను దసరా సందర్భంగానో.. దీపావళి కానుకగానో.. లేదా సంక్రాంతికో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దీన్ని మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

 రామ్ చరణ్ టీజర్‌ను వదిలారుగా

రామ్ చరణ్ టీజర్‌ను వదిలారుగా

ఆచార్య' మూవీ నుంచి ఇప్పటికే చిరంజీవి పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడీ సినిమా నుంచి రామ్ చరణ్ పోషిస్తోన్న 'సిద్ధ' పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధర్మస్థలిలో ఉన్న సిద్ధ.. అడవిలో తిరిగే అన్నలా మారడాన్ని చూపించారు. ఆద్యంతం ఈ వీడియో అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకుంటోంది.

చివర్లో వచ్చే సీన్‌కు గూస్‌బమ్స్

ధర్మస్థలిలో దేవుడి సేవలో ఉన్న సిద్ధ.. నక్సలైట్‌గా మారిన సిద్ధను ఈ వీడియోలో చూపించారు. ఇందులో చరణ్ 'ధర్మస్థలికి ఆపద వస్తే.. అది చేయించడానికి ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ముందుకు పంపుతుంది' అని ఓ డైలాగ్ చెబుతాడు. అలాగే, పూజా హెగ్డేతో రొమాన్స్‌ను కూడా చూపించారు. ఇక, చివర్లో వచ్చే షాట్ (సీన్) మాత్రం గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంది. దాన్ని ఈ వీడియోలో చూసేయండి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X