సిద్ధూ జొన్నలగడ్డ కొత్త ట్యాగ్‌లైన్.. రవితేజతో లింక్, ఆ బోయ్ కంటే ఇదే బాగుందే

చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లను గౌరవ సూచికంగా బిరుదులు లేదా ట్యాగ్‌లైన్‌లు కామన్. బ్లాక్‌ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు హీరోలకు, హీరోయిన్లకు, దర్శకులకు , నిర్మాతలకు కూడా ఈ బిరుదులుండేవి. నటరత్న, నటసామ్రాట్, నటశేఖర, నటభూషణ, రెబల్ స్టార్, సూపర్‌స్టార్, మెగాస్టార్ ఇందులో కొన్ని. కొందరికీ ఒకటికి మించి ట్యాగ్‌లైన్స్ ఉండేవి . ఎన్టీఆర్‌కు నటరత్నతో పాటు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అని.. కృష్ణకు నటశేఖర, సూపర్‌స్టార్ అని.. చిరంజీవిని కెరీర్ తొలినాళ్లలో సుప్రీం హీరోగా పిలిచిన జనాలు తర్వాత మెగాస్టార్‌ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.

ఈ జనరేషన్‌‌‌లోనూ యంగ్‌టైగర్, యంగ్ రెబల్‌స్టార్, ప్రిన్స్, పవర్‌స్టార్, ఎనర్జిటిక్ స్టార్, మెగా పవర్‌స్టార్, స్టైలీష్ స్టార్ వంటి ట్యాగ్‌లైన్స్‌ పాపులర్ . వీటిని కొంతమందికి అభిమానులు పెడితే.. ఇంకొంతమందికి సినీ ప్రముఖులో, సంస్థలో, మీడియానో ఇస్తుంటుంది. ఇంకొందరు తమకు తామే ఇచ్చుకుంటూ ఉంటారు. కొత్త ట్యాగ్‌లైన్‌తో ఉన్న నేమ్ బోర్డును సినిమాల్లో రిలీజ్ చేసి షాకిస్తుంటారు. అది చూసిన ప్రేక్షకులకు ఏం చెప్పాలో తెలియదు.

siddhu jonnalagadda reveals his new style tagline in mr bachchan movie

ఇకపోతే.. తెలుగు చిత్ర సీమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్లుగా ఎదిగిన వారిలో సిద్ధూ జొన్నలగడ్డ ఒకరు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ , చిన్న చిన్న క్యారెక్టర్లయినా ఓకే చెబుతూ సినీ జనాల కంట్లో పడ్డాడు. ఐస్‌క్రీమ్ -2, గుంటూరు టాకీస్ , కల్కి వంటి సినిమాల్లో మంచి రోల్స్ నటించిన సిద్ధూకు డీజే టిల్లు మూవీ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలంగాణ యాసలో , ఆకతాయి కుర్రాడిగా సిద్దూ నటనకు యూత్ ఫిదా అవ్వడమే కాదు.. కలెక్షన్ల కుంభవృష్టి కురిసింది. ఆ తర్వాతి నుంచి సిద్ధూ జొన్నలగడ్డ యంగ్ హీరోస్‌లలో ఒకరిగా తన మార్కెట్‌ను కూడా పెంచుకున్నాడు. డీజే టిల్లు తర్వాత సిద్ధూ జొన్నలగడ్డకు అవకాశాలు క్యూకటట్టాయి. కానీ ఏది పడితే అది చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు సిద్ధూ జొన్నలగడ్డ.

డీజే టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కిన టిల్లూ స్క్వేర్‌ టైటిల్ కార్డ్స్‌లో సిద్ధూ పేరుకు ముందు స్టార్ బోయ్ ట్యాగ్‌లైన్ వచ్చి చేరింది. దీంతో ఆయన తనకు తాను స్టార్ అనే ట్యాగ్ ఇచ్చేసుకున్నాడా అంటూ అప్పట్లో ట్రోలింగ్ నడిచింది. తాజాగా సిద్ధూ మరో కొత్త ట్యాగ్‌లైన్‌‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. షాక్, మిరపకాయ్ తర్వాత హరీష్ - రవితేజల కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఈ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. జూనియర్ ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌గా అదరగొట్టిన అతను, సెకండాఫ్‌లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో తళుక్కున మెరిశాడు. ఉన్నంత సేపు తన డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఎంటర్‌టైన్‌ చేశాడు. మిస్టర్ బచ్చన్‌కి సిద్ధూ క్యారెక్టర్ పెద్ద ఎస్సెట్‌గా మారిందని ఆడియన్స్ అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇంట్రడక్షన్ ‌లో స్టార్ బోయ్ సిద్ధూ అని టైటిల్ కార్డ్ పడుతుంది.

ఎవడ్రా నువ్వు అని రౌడీలు అడిగితే.. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటే కుర్చుంటే సెవెన్ అవర్స్ 30 మినిట్స్ టైం పడుతుంది.. సింపుల్‌గా చెప్పాలంటే మాస్ మహరాజ్ పంపించిన యూత్ యువరాజ్‌ని అని పంచ్ డైలాగ్ చెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యూత్ యువరాజ్ అన్నది సిద్ధూకి కొత్త ట్యాగ్‌ లైనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ స్టార్ బోయ్ కంటే ఇదే బాగుందన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X