నా తమ్ముడికి అమ్మాయిల పిచ్చా? టాలీవుడ్‌ యంగ్ హీరోపై అన్నయ్య క్లారిటీ

ఇటీవలి కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు మీడియా ముందుకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎవరేం ప్రశ్న అడుగుతారా? ఎక్కడ వివాదం కొనితెచ్చుకోవాల్సి వస్తుందోనని చాలా వరకు ఎత్తేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్‌ను తెలుగు మీడియా అవమానించడంతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చురకలు అంటించారు. ఇక మంచు లక్ష్మీ డ్రెస్సింగ్ స్టైల్, ఆమె వయసుపై ఓ జర్నలిస్ట్ అభ్యంతరకర ప్రశ్న అడగటంతో అది కాస్తా వివాదంగా మారింది. దీనిపై మంచు లక్ష్మీ ఏకంగా ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేయడంతో సదరు సీనియర్ జర్నలిస్ట్ ఆమెకు క్షమాపణలు చెప్పారు.

హీరోయిన్ వయసు గురించి వ్యాఖ్యలు
గతేడాది అనన్య నాగళ్లను ఓ మహిళా జర్నలిస్ట్ కమిట్‌మెంట్ గురించి అడగటం వివాదాస్పదమైంది. తమిళ హీరోయిన్ గౌరీ కిషన్‌ను ఓ జర్నలిస్ట్‌ను అందరి ముందు మీ వెయిట్ ఎంత అని అడగటం పెను సంచలనం సృష్టించింది. దానిపై సీరియస్ అయిన ఆ హీరోయిన్.. నా వయసుకు, ఇక్కడ జరుగుతున్న దానికి, నా సినిమాకు సంబంధం ఏంటీ? అని నిలదీసింది. ఆ దెబ్బకు సదరు విలేకరి క్షమాపణలు చెప్పినప్పటికీ విషయం ఇక్కడితో వదిలేది లేదని గౌరీ తేల్చిచెప్పారు. ఈ విషయంలో గౌరీ కిషన్‌కు పలువురు నటీమణులు మద్ధతు పలికారు.

Siddu Jonnalagadda Chaitanya Jonnalagadda Reacts on lady journalist controversy question about his brother

మీరు ఉమనైజరా?
కాగా.. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ మీడియాతో చాలా సరదాగా ఉంటారు. అలాంటి ఆయనకు కూడా కోపం తెప్పించారు మీడియా ప్రతినిధులు. కొద్దిరోజుల క్రితం నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన తెలుసు కదా చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టిలు హీరోయిన్లుగా నటించారు. తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా సిద్ధూ జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి.. మీరు నిజజీవితంలో ఉమనైజరా? ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ఒకేసారి ప్రేమించారా? అని ప్రశ్నించింది. దాంతో షాకైన సిద్ధూ... ఇది సినిమా గురించిన ఇంటర్వ్యూనా? లేక నా పర్సనల్ ఇంటర్వ్యూనా అంటూ నవ్వుతూ కవర్ చేశారు. తాజాగా ఈ వివాదంపై సిద్ధూ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు.

నా తమ్ముడు ఉమనైజర్ కాదు
ఇటీవల సాయిలు కంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో చైతన్య జొన్నలగడ్డ కీలకపాత్ర పోషించారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రశ్నలను నేను పట్టించుకోను.. నా తమ్ముడు ఉమనైజర్ కాదు.. అయిపోయే ఇలాంటివి ఎందుకు తీసుకుంటాం. ఉమనైజర్ అయి మాకు తెలవకపోతే బాధపడతాం... నువ్వు ఉమనైజరా అని. కాదు.. కాని దానికి ఆమె ప్రశ్న అడిగింది, దానికి ఇంత వాడు ఇంత పెద్దది రాశాడు. నేనైతే అది కూడా రాయాల్సి అవసరం లేదు అనుకుంటా. కాకపోతే వాడికి అభిమానులు ఉన్నారు, అపార్ధం చేసుకోకూడదు కాబట్టి రాయాలి. ఆ తర్వాత ఇలా ఎందుకు రాయాల్సి వచ్చిందో మాకు చెప్పాడు. నేనెందుకు ఫీల్ అవుతాను.. అతను ఉమనైజర్ కాదు. మనం కానిది అంటే ఫీల్ అవ్వాలి.. లేకపోతే బాధపడటం ఎందుకు అని చైతన్య వ్యాఖ్యానించారు.

అవకాశం ఉంటే కలిసి నటిస్తాం
నా సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు తమ్ముడు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువుంది. నేను ఇంట్లో సినిమాల గురించి మాట్లాడను. మైక్ ఆఫ్ అయ్యిందంటే నా లైఫ్ వేరు. సినిమాలు అస్సలు చూడను, ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నా మళ్లీ మీడియా వాళ్లు అడిగితే చెప్పాలి కాబట్టి. తమ్ముడి సినిమాలు చూస్తుంటా, వాడికి ఏం చెప్పను, ఒకవేళ అడిగితే చెబుతా. టిల్లూ వరకు ఫీడ్ బ్యాక్ ఇచ్చేవాడిని, టిల్లూ తర్వాత ఇక అవసరం లేదు. తెలుసు కదా సినిమా నాకు నచ్చింది. ఆ పాయింట్‌కి కనెక్ట్ అయితే నచ్చేది. రెడిట్‌ని బాగా ఎక్కువగా ఫాలో అవుతుంటాను, సినిమా డిస్కషన్స్ వచ్చినప్పుడు రివ్యూలు చదువుతుంటా. అందులో తెలుసుకదా సినిమా చాలామందికి కనెక్ట్ అయ్యింది, చాలామందికి కనెక్ట్ కాలేదు. టిల్లూ, టిల్లూ స్క్వేర్ తర్వాత టిల్లూ 3 తీసుకోవచ్చు.. కానీ వాడికి కథలు కొత్తగా ఉండాలి. ఒక నటుడిగా నాకు రోల్ బాగుంటే, తమ్ముడు ఆఫర్ చేస్తే ఖచ్చితంగా కలిసి నటిస్తాని చైతన్య జొన్నలగడ్డ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X