Tillu Square: అంతా జరిగినా ఇంకా సిగ్గు రాలే.. అనుపమతో సిద్ధు ఫ్లర్టింగ్!
టాలీవుడ్ లో ఎప్పటి నుంచో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అయితే అతని విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం డీజే టిల్లు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించగా.. ఇందులో వారి కెమిస్ట్రీకి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ రావాలని కోరుకున్నారు. అందుకనుగుణంగానే సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' (Tillu Square) వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీని నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. దాని వివరాల్లోకి వెళితే..

సిద్దు సినిమాలు: చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా సిద్ధు జొన్నలగడ్డ పేరు మారుమోగిపోయింది. ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో ఉంటున్న సిద్ధుకి ఈ సినిమా సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల మూవీస్ తో ఆకట్టుకున్న సిద్ధు జొన్నల గడ్డ డీజే టిల్లుతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా ముద్ర వేసుకున్నాడు.

మల్లిక్ రామ్ డైరెక్షన్: ఇప్పుడు డీజే టిల్లుకు సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' (Tillu 2) వస్తోంది. నటీనటులు, టెక్నిషియన్స్ పరంగా పలు మార్పులు జరిగాయి. ఇందులో హీరోయిన్ గా బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫోర్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మనసు విరిగినట్టుంది: శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాకు సంబంధించిన ఓ పాటను జూలై 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమోలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ షూస్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. 'మనసు విరిగినట్టుంది ఎక్కడనో' అని సిద్దు అంటే అనుపమ చూస్తుంది. 'ఉన్నడా బాయ్ ఫ్రెండు' అని సిద్ధు అడిగితే.. 'నీకెందుకు?' అని అనుపమ బదులిస్తుంది.
ఉపయోగం ఏముంది: 'ఉంటే నా షూ నేను వేసుకుని వెళ్లిపోతా' అని సిద్దు అంటాడు. 'లేకపోతే అని అనుపమ అంటే.. నిన్నేసుకుని పోతా' అని సిద్దు సమాధానం ఇస్తాడు. 'ఇప్పుడే కదరా కలిశాం. అప్పుడే ఓపెన్ గా ఫ్లర్ట్ చేస్తున్నావా?' అని అనుపమ అడిగితే.. 'ఓపెన్ గా అంటే నేను చేస్తున్న సంగతి నీకు తెలియాలి కదా. లేకపోతే చేసి ఉపయోగం ఏముంది' అని సిద్దు అంటాడు.

సిగ్గు రాలే ఇంకా: సిద్ధు మాటకు నవ్వుతూ ఆలోచిస్తుంది అనుపమ. తర్వాత పక్కన ఉన్న వ్యక్తి.. 'పోయిన సారి అంతా అయినా కూడా సిగ్గు రాలే టిల్లు అన్నకి' అని అంటాడు. అప్పుడు 'టికెటే కొనకుండా' అనే సాగే పాట మ్యూజిక్ ప్లే చేశారు. ఈ పాటను జూలై 26న రిలీజ్ చేయనున్నారు. డీజే టిల్లు టైటిల్ సాంగ్ పాడిన రామ్ మిరియాలే ట్యూన్ చేసి ఈ పాటను ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











