రాతల్లోనూ రఫ్పాడించేస్తున్న యంగ్ హీరో, కొత్త కథ చెక్కేస్తున్న సిద్ధూ
హాట్ అండ్ క్యూట్ లుక్స్ తో రొటీన్ కు భిన్నమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ స్టడీగా దూసుకుపోతున్న సిద్ధూ జొన్నలగడ్డ, ఇప్పుడు మరో పడవపైనా కాలేసేశాడు. ఇటీవలే కృష్ణా అండ్ హిస్ లీలా సినిమాతో అలరించిన సిద్ధూ, దీనికి కో - రైటర్ గానూ వ్యవహించాడట. దీంతో ఇప్పుడు అబ్బాయి రైటర్ గానూ బీజీగా మారుతున్నాడు.
కృష్ణా అండ్ హిస్ లీలా సినిమా స్టోరీకీ, డైలాగులకు మంచి మార్కులు పడటంతో సిద్ధూలోని రైటర్ ను బాగా వాడేసుకోవాలని ఇండస్ట్రీ జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇందులో భాగంగానే అబ్బాయి అప్పుడే తన పెన్నుకూ, మెదడుకూ పదును పెట్టేస్తున్నాడు. ప్రస్తుతానికి వింతగాథ వినుమా అనే క్రైమ్ థ్రిల్లర్ రాస్తున్న సిద్ధూ, మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టేశాడని తెలుస్తోంది.

వింత గాథ వినుమాతో పాటూ, సిద్ధూతో గ్యాంగ్ స్టర్స్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన అజయ్ భూయాన్ కు కూడా ఓ స్కిప్ట్ రాసిచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఏమైనా అబ్బాయి రైటర్ గానూ మస్త్ బిజీగా మారిపోయాడనే చెప్పాలి. మరి ఓ వైపు హీరోగానూ మంచి ఆఫర్లు అందుకుంటోన్న సిద్ధూ, రొటీన్ కు భిన్నంగా రెండు పడవల పై విజయవంతంగా ప్రయాణం చేస్తాడని ఆశిద్దాం.
sidhu jonnalagadda writer krishna and his leela ravikanth perepu vintha gaada vinuma ajay bhuyan సిద్ధూ జొన్నలగడ్డ రైటర్ కృష్ణా అండ్ హిస్ లీలా రవికాంత్ పేరెపు వింతగాధ వినుమా అజయ్ భుయాన్


Click it and Unblock the Notifications