సైమాలో అదరగొట్టిన నిధి అగర్వాల్.. మెగాస్టార్‌ను ఆకట్టుకొన్న బ్యూటీ

విదేశీ గడ్డ ఖతర్‌లో సైమా అవార్డుల కార్యక్రమం బ్రహ్మండంగా సాగిపోతున్నది. ఈ వేదికపై తెలుగు తారలు తళతళలాడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా మారారు. సైమా అవార్డుల కార్యక్రమంలో తారలు సూపర్ హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఆ క్రమంలోనే నిధి అగర్వాల్ కూడా విశేషంగా ఆకట్టుకొన్నారు. తన ప్రదర్శన తర్వాత చిరంజీవి ఆశీస్సులు అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమం ఖతర్‌లోని దోహాలో అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ కార్యక్రమం శుక్రవారం వరకు కొనసాగింది. తెలుగు సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ చూపిన నటీనటులు, చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

SIIMA awards 2019 complet list: Nidhi Aggarwal and Chiranjeevi goes crazy

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి పాటలకు నిధి అగర్వాల్ స్టెప్పులేసి అదరొట్టింది. ఫెర్ఫార్మెన్స్‌కు ముందు హార్లే డెవిడ్సన్ బైక్‌పై ఎంట్రీ ఇచ్చింది. తన ఎలక్ట్రికల్ ఫైర్‌తో స్టేజిని దడదడలాడించింది. ఫెర్ఫార్మెన్స్ తర్వాత చిరంజీవి వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చింది. చిరంజీవిని కౌగిలించుకొని ఆనందంలో మునిగిపోయింది. అనంతరం మాట్లాడుతూ.. తన ఫెర్ఫార్మెన్స్‌ను చిరంజీవికి అంకితం ఇస్తున్నాను అని చెప్పింది. గ్లామర్ పరంగా కూడా నిధి ఆహుతులను ఆకట్టుకొన్నది.

SIIMA awards 2019 complet list: Nidhi Aggarwal and Chiranjeevi goes crazy

సైమా అవార్డ్స్‌ 2019 విజేతలు వీరే

ఉత్తమ చిత్రం : మహానటి

ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌ (రంగస్థలం)

ఉత్తమ నటుడు : రామ్‌చరణ్‌ (రంగస్థలం)

ఉత్తమ నటి : కీర్తి సురేష్‌ (మహానటి)

విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)

విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)

ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)

ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)

ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)

ఉత్తమ విలన్‌ : శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)

ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం)

ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం)

ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్‌ (విజేత)

ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రం‍గస్థలం)

సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ : విజయ్‌ దేవరకొండ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X