సైమాలో మెరిసిన విజయ్ దేవరకొండ.. రెండు అవార్డులతో కేక

అర్జున్ రెడ్డితోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన నటించిన గీత గోవిందం, టాక్సీవాల్ భారీ విజయాలు అందుకోగా, నోటా, డియర్ కామ్రేడ్ ఓ మోస్టరు విజయాన్ని అందించాయి. జయపజయాలతో సంబంధం లేకుండా క్రేజీ హీరోగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకొన్న యువతరం హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు అనే ముద్ర పడింది.

తాజాగా ఖతర్‌లో జరుగుతున్న సైమా అవార్డు 2019 వేదికపై విజయ్ దేవరకొండ మరోసారి మెరిశాడు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించుకొన్నాడు. రెండు అవార్డులను సొంతం చేసుకొని సైమాలో సత్తా చాటాడు.

siima-awards-2019: Vijay Deverakonda chosen for Best Critic award

గతేడాది విడుదలై సినీ విమర్శకులు ప్రశంసలతోపాటు భారీ వసూళ్లను సాధించిన గీతా గోవిందం మూవీ విజయ్ దేవరకొండకు అవార్డును సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో ఉత్తమ పెర్ఫార్మెన్స్‌కు గాను క్రిటిక్స్ బెస్ట్ అవార్డును విజయ్ సొంతం చేసుకొన్నాడు.

siima-awards-2019: Vijay Deverakonda chosen for Best Critic award

ఇక రెండో అవార్డు విజయ్‌ దేవరకొండకు స్పెషల్‌గా మారింది. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా మరో అవార్డు విజయ్ దేవరకొండను వరించింది. ఈ విధంగా 2019 సైమా అవార్డుల్లో ఈ క్రేజీ స్టార్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఈ చిత్రంలో విజయ్ నటనకు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X