SIIMA Awards 2023: సైమా అవార్డులపై ప్రకటన.. నామినేషన్స్‌పై క్లారిటీ

ఏదైనా రంగంలో రాణించిన వారికి అవార్డులను ప్రదానం చేస్తుంటారు. సినీ రంగానికి సంబంధించిన ఇండియా మొత్తంలో చాలా రకాల పురస్కారాలను అందిస్తున్నారు. అందులో సౌత్ ఇండియాలో ఉన్న సినీ పరిశ్రమలకు చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో టాలెంట్‌ను వెలికి తీసి ఇచ్చేందుకు తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక అవార్డులే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా). ఈ అవార్డులను రెండు రోజుల పాటు జరుపుతూ.. ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన వారికి ప్రదానం చేస్తుంటారు.

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఇప్పటికే పది వసంతాలను పూర్తి చేసుకుంది. చివరిగా 2022కు సంబంధించిన నిర్వహించిన కార్యక్రమం బెంగళూరులో అంత్యత వైభవంగా జరిగింది. దీంతో 2023వ ఏడాదికి సంబంధించిన ఈవెంట్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత హై రేంజ్‌లో నిర్వహించేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సైమా 2023 అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన డేట్, వేదిక వివరాలను అధికారికంగా ప్రకటించారు.

SIIMA Awards 2023

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2023 కార్యక్రమాన్ని దుబాయ్‌లో నిర్వహించబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. అంతేకాదు, ఈ వేడుకను సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో జరపబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు అవార్డులను ప్రకటించబోతున్నారు. ఇక, రెండో రోజు తమిళం, మలయాళం ఇండస్ట్రీలకు సంబంధించిన అవార్డులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని సౌతిండియాలోనే పేరున్న ఇద్దరు టాలెంటెడ్ హీరోలు హోస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

SIIMA Awards 2023

2023వ సంవత్సరానికి గానూ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా)ను ఎంపిక చేసేందుకు గానూ ఓటింగ్‌ను త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఆ వివరాలను సదరు నిర్వహకులు సోషల్ మీడియా వేదిక ప్రకటిస్తారని తెలిసింది. అలాగే, ఏఏ విభాగాల్లో అవార్డులను అందించబోతున్నారో తెలిపే కెటగిరీలను సైతం మరికొద్ది రోజుల్లోనే అనౌన్స్ చేయనున్నారు. ఇక, 2023 సంవత్సరానికి గానూ నటీనటులు, టెక్నీషియన్ల పేర్లతో కూడిన నామినేషన్స్‌ను సైతం జూలైలో ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X