పవన్ కల్యాణ్ అభిమాని కథగా 'సైలెన్స్ ప్లీజ్'.. సైలెంట్ హిట్ గ్యారెంటీ!
బెంగళూరుకు చెందిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా రూపొందిన నిశ్శబ్ద2 కన్నడలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సైలెన్స్ ప్లీజ్ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. వల్లూరిపల్లి రమేష్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు.మార్చి 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

ప్రతీవారం ఏడెనిమిది సినిమాలకు తక్కువ కాకుండా రిలీజయ్యే ప్రస్తుత తరుణంలో.. ఈ వారం కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే విడుదలవుతుండడం.. వాటిలో 'సైలెన్స్ ప్లీజ్' పెద్ద సినిమా కావడం కూడా కలిసి రానుంది. 'సైలెన్స్ ప్లీజ్' కచ్చితంగా సైలెంట్ హిట్ అవుతుందనే గట్టి నమ్మకం మా అందరిలోనూ ఉంది.. అన్నారు!!


Click it and Unblock the Notifications











