Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇలా చేస్తే ఏకంగా కైలాసానికే... నవ్వు పుట్టిస్తున్న ‘సిల్లీ ఫెలోస్’ టీజర్
టాలీవుడ్ కామెడీ స్టార్స్ హీరో అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్లో 'సిల్లీ ఫెల్లోస్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా మోషన్ టీజర్ పోస్టర్ విడుదల చేశారు. అల్లరి నరేష్ బైక్ నడుపుతున్నట్లు ఉన్న ఈ మోషన్ టీజర్లో వెనకలా సునీల్ వేలాడుతూ కనిపించాడు. ''ఈ స్పీడ్ తో వెళితే శ్రీశైలానికి గంటలో వెళ్లిపోతాం కదరా? అని సునీల్‌ను నరేష్ అడిగితే.. సునీల్ 'గంట ఎందుకురా? అరగంటలోనే వెళ్లిపోతాం.. కైలాసానికి' అంటూ చెప్పిన ఒక్క డైలాగుతో సినిమాలో ఇద్దరి మధ్య ఎలాంటి కామెడీ సీన్లు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి కావడంతో సినిమాకి ప్రమోషన్స్ మొదలయ్యాయి. సునీల్, అల్లరి నరేష్ నుండి హిట్స్ వచ్చి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్లో గతంలో 'సుడిగాడు' అనే ఫుల్ కామెడీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా 'సిల్లీ ఫెలోస్' ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్‌లోని దాదాపు కమెడియన్లు అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. బ్లూప్లానెట్ ఎంటర్టెన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.