twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలా చేస్తే ఏకంగా కైలాసానికే... నవ్వు పుట్టిస్తున్న ‘సిల్లీ ఫెలోస్’ టీజర్

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ కామెడీ స్టార్స్ హీరో అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్లో 'సిల్లీ ఫెల్లోస్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా మోషన్ టీజర్ పోస్టర్ విడుదల చేశారు. అల్లరి నరేష్ బైక్ నడుపుతున్నట్లు ఉన్న ఈ మోషన్ టీజర్లో వెనకలా సునీల్ వేలాడుతూ కనిపించాడు. ''ఈ స్పీడ్ తో వెళితే శ్రీశైలానికి గంటలో వెళ్లిపోతాం కదరా? అని సునీల్‌ను నరేష్ అడిగితే.. సునీల్ 'గంట ఎందుకురా? అరగంటలోనే వెళ్లిపోతాం.. కైలాసానికి' అంటూ చెప్పిన ఒక్క డైలాగుతో సినిమాలో ఇద్దరి మధ్య ఎలాంటి కామెడీ సీన్లు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

    సినిమాకి సంబంధించిన అన్ని ప‌నులు పూర్తి కావ‌డంతో సినిమాకి ప్ర‌మోష‌న్స్ మొదలయ్యాయి. సునీల్‌, అల్ల‌రి న‌రేష్ నుండి హిట్స్ వచ్చి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    Silly Fellows Movie Motion Teaser

    అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్లో గతంలో 'సుడిగాడు' అనే ఫుల్ కామెడీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా 'సిల్లీ ఫెలోస్' ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్లోని దాదాపు కమెడియన్లు అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. బ్లూప్లానెట్ ఎంటర్టెన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Silly Fellows Movie Motion Teaser released. The movie Starring Allari Naresh, Sunil, Chitra Shukla, Poorna, Nandhini Rai, Brahmanandam, JayaPrakash Reddy, Posani Krishna Murali, Raja Raveendra, Chalapathi Rao, Adhurs Raghu, Jhansi, Hema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X