అల్లరి నరేష్, సునీల్ మూవీ ‘సిల్లీ ఫెల్లోస్’ రిలీజ్ డేట్ ఖరారు
టాలీవుడ్ కామెడీ స్టార్స్ హీరో అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్లో 'సిల్లీ ఫెల్లోస్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి కావడంతో సినిమాకి ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సునీల్, అల్లరి నరేష్ నుండి హిట్స్ వచ్చి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్లో గతంలో 'సుడిగాడు' అనే ఫుల్ కామెడీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా 'సిల్లీ ఫెలోస్' ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్లోని దాదాపు కమెడియన్లు అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు.
బ్లూప్లానెట్ ఎంటర్టెన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











