సిల్లీ ఫెలోస్ ట్రైలర్: ఎమ్మెల్యే జాకెట్‌కి నేను రైటు వీడు లెఫ్టు.. పిచ్చ కామెడీ!
చాలా గ్యాప్ తరువాత సునీల్, అల్లరి నరేష్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి కామెడీ చిత్రం సిల్లీ ఫెలోస్. సుస్వాగతం, సూర్య వంశం, సుడిగాడు వంటి హిట్ చిత్రాల దర్శకుడు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ అయింది.
హిల్లేరియస్ కంటెంట్ తో ట్రైలర్ అదిరిపోయింది. అల్లరి నరేష్, సునీల్ నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారో ఆ కామెడీ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టం అవుతోంది. ట్రైలర్ మొత్తం కామెడీ పంచులతో నిండిపోయింది. ప్రారంభించండి నాన్న అంటూ పోసాని వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది.

ఎమ్మెల్యే జాకెట్ కి నేను రైటు.. వీడు లెఫ్టు.. అని అల్లరి నరేష్ కామెడీ పంచ్ లు పేలుస్తున్నాడు. 'ఎక్స్ట్రాలు చేసిందనుకో అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 స్టైల్ లో మూతిలో మూతిపెట్టి నాకేయ్' అంటూ సునీల్ చెబుతున్న డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. సెప్టెంబర్ 7 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











