The WARRIORR కోసం రంగంలోకి కోలీవుడ్ హీరో.. ఎన్టీఆర్, మనోజ్ తర్వాత రామ్‌తోనే!

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. అప్పటి వరకూ సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడిన అతడిని ఈ చిత్రం సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. అదే సమయంలో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో అప్పటి నుంచి మరింత జోష్‌తో రామ్ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే గత ఏడాది 'రెడ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఈ సారి కూడా హిట్‌ను అందుకుని హ్యాట్రిక్‌ను సొంతం చేసుకోవాలని చాలా పట్టుదలతో కనిపిస్తున్నాడు.

వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామితో కలిసి 'ద వారియర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని చాలా రోజుల క్రితమే ప్రకటించినా.. ఆ తర్వాత కోవిడ్ సెకెండ్ వేవ్ రావడంతో షూటింగ్‌ను మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించారు. అంతేకాదు, వరుసగా పలు షెడ్యూళ్లను కూడా చకచకా పూర్తి చేసేశారు. అలా అంతా సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే హీరో రామ్ షూటింగ్‌లో గాయపడ్డాడు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను మరోసారి బ్రేకిచ్చి.. మళ్లీ మొదలెట్టారు.

Simbu Sings Special Song for Ram Pothinenis The WARRIORR

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ద వారియర్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ కాప్‌ గెటప్‌తో కనిపించాడు. దీంతో ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. అంతేకాదు, ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటి నుంచే చాలా మంది బయ్యర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఈ సినిమా రైట్స్‌ ఇప్పటికే భారీ ధరలకు అమ్ముడు పోయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

రామ్ నటిస్తోన్న 'ద వారియర్' మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో శింబు రంగంలోకి దిగాడు. అయితే, అతడు ఇందులో నటించడం లేదు. కానీ, ఈ సినిమాలో ఓ పాటను పాడబోతున్నాడు. బుల్లెట్ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను శింబుతో పాడించబోతున్నాడు డీఎస్పీ. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు, అతడితో కలిసున్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో శింబు.. ఎన్టీఆర్ 'బాద్‌షా', మనోజ్ 'పోటుగాడు' సినిమాల్లో పాటలు పాడిన విషయం తెలిసిందే. ఇవి పెద్ద హిట్లుగా నిలిచాయి.

Simbu Sings Special Song for Ram Pothinenis The WARRIORR

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ద వారియర్' మూవీలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X