'సింగం' దర్శకుడితో క్రేజీ హీరో సినిమా!
తమిళ స్టైలిష్ హీరో శింబు ఇటీవల మంచి చిత్రాలు చేస్తున్నాడు. యువతని బాగా ఆకర్షించే హీరోల్లో శింబు ఒకడు. ప్రస్తుతం శింబు కెరీర్ గ్రాఫ్ స్టడీగా ఉంది. భవిష్యత్తులో శింబు మరిన్ని క్రేజీ చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. శింబు గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చక్క చివంత వానం చిత్రంలో నటించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ ఏడాది విడుదలైన అత్తారింటికి దారేది రీమేక్ చిత్రం నిరాశపరిచింది. శింబు తదుపరి చిత్రాల గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.
తమిళ దర్శకుడు హరి మాస్ ప్రేక్షకులని టార్గెట్ చేసుకుని సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. సూర్యతో తెరకెక్కించిన సింగం సిరీస్ తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. హరి చివరగా తెరకెక్కించిన చిత్రం సామి స్క్వేర్. విక్రమ్ హీరోగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం హరి తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. హీరో శింబుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహకాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల శింబు, హరి మధ్య చర్చలు కూడా ప్రారంభమయ్యాయట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. చర్చలన్నీ ఓ కొలిక్కి వచ్చాక ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే శింబు తాను నటిస్తున్న ఓ చిత్రం కోసం కేవలం 37 రోజుల్లో 13 కేజీల బరువు తగ్గి స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు.


Click it and Unblock the Notifications











