గొప్ప మనసు చాటుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్: సింహాద్రి కలెక్షన్లు ఏం చేస్తున్నారో తెలిస్తే!

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో సినిమాల రీ రిలీజ్‌ల హడావిడి కనిపిస్తోంది. గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాలనో, అప్పుడు ప్రేక్షకులు ఆదరించని క్లాసిక్ మూవీలనో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన రోజుల్లో ప్రేక్షకుల ముందుకు మరోసారి తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రాగా.. వాటికి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఆయా చిత్రాలకు మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి' సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన చిత్రమే 'సింహాద్రి'. అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి మరో ముఖ్యమైన ప్రకటన వచ్చింది. అందులో 'ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో 2003లో వచ్చిన 'సింహాద్రి' మూవీని మే 20వ తేదీన రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రెస్ నోట్ ద్వారా మీ అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాము' అని పేర్కొన్నారు.

Simhadri Re-Release Collections to be Spent for Jr NTR Fans

అదే ప్రకటనలో 'సింహాద్రి సినిమాను థర్ట్ పార్టీ దగ్గర ఓ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి దాన్ని రీ రిలీజ్ చేసి మా అభిమాన హీరో ఎన్టీఆర్ గారి పుట్టినరోజును చాలా ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాం. ఈ రీ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్లను ఫ్యాన్స్‌కే తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇందుకోసం అందరం కలిసి మాట్లాడుకుని రీ రిలీజ్ ద్వారా వచ్చే డబ్బును ఏ జిల్లాకు ఆ జిల్లాలో కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ గారి అభిమానులకు సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం ఎన్టీఆర్ గారికి చెప్తే 'మంచి ఉద్దేశం.. అలాగే ముందుకు వెళ్లండి' అని చెప్పారు. ఈ రీ రిలీజ్ అభిమానుల సాయం కోసమే కానీ, మా స్వలాభం కోసం కాదు' అని వివరించారు. దీంతో వీళ్ల నిర్ణయానికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.

Simhadri Re-Release Collections to be Spent for Jr NTR Fans

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం ఇస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X