ఆకాశ్ కోసం హాట్ అత్తగారు... హీరోయిన్ తల్లిగా సిమ్రన్
కొడుకు కెరీర్ పై సీరియస్ గా దృష్టిపెట్టిన పూరీజగన్నాథ్ ఈ సారి ఎక్కడా తప్పు దొర్లకుండా దగ్గరుండి చూసుకుంటున్నాడు. అనీల్ పాడూరి దర్శకత్వంలో ఆకాశ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా రషస్ చూసిన పూరీ, సినిమాకు ఆయువుపట్టు అయిన రొమాంటిక్ సన్నివేశాలే అసలు బాగోకపోవడంతో రీ-షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సన్నివేశాలను దగ్గరుండి పర్యవేక్షించాలని కూడా నిర్ణయించుకున్నాడు.
మరోవైపు సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, చిత్రానికి మరి కాస్త గ్లామర్ యాడ్ చేసేందుకు ఓ సీనియర్ హీరోయిన్ ను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. కథలో అకాశ్ అత్తగారి పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో, ఈ పాత్రకోసం అలనాటి అందాల భామ సిమ్రన్ ను తీసుకువస్తున్నారట.

రొమాంటిక్ లో కేతికా శర్మ తల్లిగా సిమ్రన్ కనిపించబోతోంది. ఇప్పటివరకూ ఈ విషయాన్ని గుప్తంగా ఉంచిన టీమ్, సినిమాకు హైప్ క్రియేట్ చేసేందుకు సరైన సమయంలో ఆవిడ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. ఇక వీరితో పాటూ మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైనా, రమ్యకృష్ణ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది.
రొమాంటిక్ సినిమాలో ఓ కొత్త తరహా ప్రేమకథ అని తెలుస్తోంది. ఆకాశ్ ఓ మురికివాడకు చెందిన అబ్బాయిగా కనిపించబోతున్నాడు. ఇక ఆకాశ్, కేతికా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి అని తెలుస్తోంది. మరి ఆకాశ్ కు ఈ సినిమా అయినా హీరోగా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











