దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు.. కుండ బద్దలు కొట్టిన సింగర్ అనంత శ్రీరాం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన అంశం అత్యంత వివాదంగా మారింది. అయితే దివంగత వైఎస్ఆర్‌పై పోస్టు పెట్టిన అకౌంట్‌ను నిర్వహించేది గాయకుడు అనంత శ్రీరామ్ అంటూ సోషల్ మీడియాలో రూమర్లు వినిపించాయి. వైఎస్ఆర్ వివాదం చుట్టూ తన పేరు కేంద్ర బిందువుగా మారడంతో అనంత శ్రీరాం వీడియోను రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. ఈ వివరణ వివారాలు, వివాదానికి సంబంధించిన అంశంలోకి వెళితే...
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ సభలో ఓ చిన్నారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్న వీడియోను పోస్టు చేసి.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంత ఫేక్ న్యూస్ కంటే మరోటి ఉంటుందా? స్కాన్ చేయకుండానే గుండెలో హోల్ ఉందని చెప్పేశారట అంటూ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో అనంత శ్రీరాం, పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టారు. దాంతో వైసీపీ అభిమానులు తీవ్రంగా స్పందించారు.

దివంగత వైఎస్ఆర్‌కు సంబంధించిన వీడియో తన పేరుతో వివాదం కావడంతో అనంత శ్రీరాం స్పందించారు. నమస్కారం అండీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, ఆయనను అవమానించే విధంగా పొలిటికల్ మిసైల్ అనే ఖాతాలో కొన్ని రాతలు రాస్తూ, పోస్టులు పెడుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది అని అనంత శ్రీరాం తెలిపారు.
వైఎస్ఆర్‌ను నిందించే విధంగా రాతలు, పోస్టులు పెడుతున్నది నేనే అనే వదంతులు వినిపించాయి.ఆ పోస్టుల వెనుక, వదంతుల వెనుక నాకు సంబంధం లేదు. నేను గాయకుడిగా అన్ని పార్టీలకు పాటల రాస్తాను. ఏ పార్టీపై నాకు వ్యక్తిగతం అభిప్రాయం లేదు. కాబట్టి వైసీపీ శ్రేణులకు నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను అంటూ అనంత శ్రీరాం వివరణ ఇచ్చారు.
భవిష్యత్‌లో రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయాలు తెలియజేయాల్సి వచ్చినా.. నేను నిక్కచ్చిగా, నిర్భయంగా నా అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తాననే తప్పా.. ఇలా వేరే పేరుతో చేయను. భవిష్యత్‌లో కూడా అలా జరగదు అని అనంత శ్రీరాం తన వీడియోలో వెల్లడించారు.
ప్రస్తుతం నేను అమెరికాలో జరుగుతున్న నాటా మహా సభల్లో పాల్గొంటున్నాను. నేను అమెరికాలో ఉండటం వల్ల వీడియో ద్వారా స్పందిస్తున్నాను. ఇండియాకు రాగానే ఈ విషయంపై నేను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని అనంత శ్రీరాం తన వీడియోలో స్పష్టీకరించడమే కాకుండా ఈ వివాదానికి తన పరిధిలో ముగింపు పలికేలా చేశారు.


Click it and Unblock the Notifications











