Chinmayi Sripada: ఆ సమయంలో బాధితురాలు మైనరే.. జానీ మాస్టర్ రేప్ కేసుపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు..

Chinmayi Sripada: నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​ పై అత్యాచార ఆరోపణలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో స్టార్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న జానీ మాస్టర్ కు ఎదురుదెబ్బ తగిలింది. తన దగ్గర పనిచేస్తున్న లేడీ కొరియోగ్రాఫర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు, బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ హాట్ టాపిక్ పై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. తనదైన శైలిలో షాకింగ్ చేసింది.

ప్రముఖ సినీ డ్యాన్సర్ జానీ మాస్టర్ తనకు 2019లో ఢీ షోలో పరిచయమయ్యాడనీ, ఆ పరిచయంలో తనను ఆయన టీంలో చేర్చుకున్నారని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో తనని పలుమార్లు వేధించారనీ, అవుట్ డోర్ షూటింగ్ పేరిట చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు పేర్కొంది. ఈ క్రమంలో బాధితురాలు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది.

Singer Chinmai Sripada made shocking comments on the Johnny Master rape case

అదే సమయంలో మత మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడనీ, పలు మార్లు దాడి చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తన లైంగిక కోరికలు తీర్చడానికి తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే.. ఇండస్ట్రీలో లేకుండా చేశానని భయాభంత్రులకు గురి చేశాడని ఆరోపించింది. జానీ మాస్టర్ భార్య కూడా తనకు సహకరించేదనీ, ఆమె కూడా తనపై దాడి చేసిందని ఎఫ్ఆర్ఐలో వెల్లడించింది. దీంతో జానీ మాస్టర్ పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. దీంతో ఈ అంశం అటు సీని, రాజకీయ పరంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయంపై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద సెన్సెషనల్ కామెంట్ చేసింది. తాజాగా టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny master)పై అత్యాచార ఆరోపణలు వెలుగులోకి రావడంతో బాధిత యువతకి అండగా నిలిచింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా షాకింగ్ ఓ పోస్ట్ చేసింది. ఇంతకీ పోస్ట్ పెట్టిందంటే.. సింగర్ చిన్మయి శ్రీపాద పలు మీడియా కథనాలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'పలు నివేదికల ప్రకారం బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధింపులు ప్రారంభించారు. ఈ కేసులో ఆ అమ్మాయి పోరాడేందుకు కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా' అని చిన్మయి షాకింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇకపోతే ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె తన పాటలతోనే కాదు పలు కాంట్రవర్సీలతో చాలా ఫేమస్ అయ్యింది. ఆమె ఓ ఫెమినిస్ట్ అనే విషయం తెలిసిందే. ఆమె సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌ సహా లేడీ యాక్టర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. అలాగే.. సమాజంలో ఎక్కడైనా మహిళలకు, చిన్నారులకు ఇబ్బందులు ఎదురైన ఆ ఘటనపై ఆమె తనదైన శైలిలో స్పందిస్తుంది. బాధితులకు మద్దతుగా నిలుస్తోంది. ఆమె సోషల్‌ మీడియాలో ఏ పోస్టు పెట్టిన పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X