సింగర్ చిన్మయి ప్రెగ్నెన్సీ వార్తలు… అసలు విషయం చెప్పేసింది!
దక్షిణాదిన క్యాస్టింగ్ కౌచ్ మీటూ ఉద్యమంతో సింగర్ చిన్మయి బాగా ఫేమస్ అయింది. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె. తనను చిన్నతనంలో లైంగికంగా వేధించాడని, అసభ్యంగా తాకడంటూ ఆరోపణలు చేసింది. అలా ఆమె అందరికీ నోటెడ్ అయిపొయింది. అయితే తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న కామెంట్స్ కి ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆడవాళ్లకు గొంతులా
తెలుగు, తమిళ భాషలలో కొన్ని పాటలు పాడడమే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా రాణించిన చిన్మయి ఎంతో మంది ఆడవాళ్లకు గొంతులా మారింది. తాము చెప్పుకోలేని విషయాలు, బాధ పడ్డ సంఘటనల గురించి చిన్మయితో చెప్పుకుంటారు. తమ బాధనంతా ఆమె వద్ద వెళ్లగక్కుంటారు. అలా చిన్మయికి రోజుకు కొన్ని వందల మంది ఆడవాళ్లు తమ వేధింపుల గురించి చెబుతుంటారు.
వాటిని ఆమె వెలుగులోకి తెస్తూ ఉంటుంది.

బావమరిది పెళ్ళిలో
తాజాగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన బావమరిది రోహిత్ రవీంద్రన్ వివాహ వేడుక సందర్భంగా తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. ఈ దెబ్బకు ఆమె కడుపు భాగం కొంచెం ఎత్తుగా కనిపించడంతో ఆమె గర్భం ధరించిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అంశం మీద చిన్మయి స్పందించింది.

మాడిసార్ తోనే అంతా
తన పెళ్లికి సంబంధించిన త్రోబ్యాక్ పిక్చర్ పంచుకుంటూ, ఆమె అన్ని ఊహాగానాలకు ముగింపు పలికే విధంగా ఒక భారీ నోట్ రాసింది. "ఇది పెళ్లిలో మాడిసర్‌లో నేను, ఈ మాడిసార్ తో నాకు సమస్యలు ఉన్నాయి, దీని వలన 'కడుపు'గా భారీగా కనిపించేలా చేయడంతో మీకు అలా కనిపించి ఉండవచ్చు మీరు ఏమైనా అనుకోండి, కానీ నేను గర్భవతిని కాదు'' అని ఆమె చెప్పుకొచ్చారు.

నేను విసిగిపోయాను
ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఈ రోజు 'చిన్మయి బేబీ బంప్' అంటూ థంబ్ నెయిల్స్ పెట్టడంతో నేను విసిగిపోయాను, ఆ ఫోటో తప్పు కోణంలో తీసినట్లు అనిపించింది. నా చీర చాలా వదులుగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. నేను నా వ్యక్తిగత జీవితాన్ని పంచుకోనని ఆమె పేర్కొంది. సోషల్ మీడియాలో నేను యాక్టివ్ గా ఉన్నప్పటికీ నాకు సంబంధించిన అన్ని వివరాలు నేను పంచుకోనని అన్నారు.

దయచేసి ఆపండి
"సమయం వచ్చినప్పుడు నేను నా గర్భధారణకు సంబంధించి ఏదైనా పంచుకోకపోవచ్చు లేదా చేయకపోవచ్చు, అది నా నిర్ణయం అని పేర్కొన్నారు. మేము 100% పిల్లల ఫోటోలను ఎప్పుడూ పంచుకోమని పేర్కొన్న ఆమె, వారు సోషల్ మీడియాలో ఉండరు మరియు నేను ఈ గర్భధారణ ఊహాగానాలతో అలసిపోయా, దయచేసి ఆపండి "అని చిన్మయి ముగించారు.


Click it and Unblock the Notifications











