Chinmayi Sripada : వర్జిన్ అమ్మాయి దొరకడం అదృష్టమే.. సింగర్ చిన్మయి దిమ్మతిరిగే రిప్లే
Chinmayi Sripada: టాలీవుడ్ సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ అమ్మడు తన పాటల కంటే కాంట్రవర్షల్ కామెంట్స్ తోనే తరచూ వార్తలలో నిలుస్తుంది. సమాజానికి సంబంధించిన ఏ విషయమైనా తనదైన రీతిలో స్పందిస్తూ.. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం సింగర్ చిన్మయి నైజం. అలా తాజాగా మరో వివాదంతో వార్తలలో నిలిచింది. ఇంతకీ ఈ అమ్మడు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి? నెటిజన్స్ కు దిమ్మ తిరిగిపోయేలా? కౌంటర్ ఇచ్చిన అంశం ఏంటో? మీరు కూడా ఓ లూక్కేయ్యండి.
సింగర్ చిన్మయి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. డిసెంబర్ 31న పబ్స్, పార్టీలు, జల్సాలు, అంటూ యూత్ ఎంజాయ్ చేసిన విషయం తెలిసింది. అయితే.. ఈ తరుణంలో బ్లింక్ ఇట్ సీఈఓ షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తూ.. 'ఒక లింక్ ఇట్ యాప్ నుండి ఒక్కరోజులో లక్షకు పైగా కండోమ్స్ అమ్ముడయ్యాయి. ఒక్క సైట్ నుంచి ఇలా అమ్ముడుపోతే.. ఇతర ఈ కామర్స్ సైట్లలో అమ్ముడైన కండోమ్స్ సంఖ్య చూస్తే షాక్ అవుతారు. ఈ కామర్స్ మార్కెటింగ్ సేల్స్ ఒక్క రోజు సేల్స్ 10 మిలియన్ల వరకు ఉంటాయి. నీ లెక్కన చూస్తే.. ఈ తరంలో పెళ్లికి వర్జిన్ అమ్మాయి దొరకడం అదృష్టమే' అంటూ తన ఎక్స్ వేదికగా షాకింగ్ పోస్టు పెట్టారు బ్లింక్ ఇట్ సీఈవో.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో తెగ వైరల్ అయింది. దీంతో ఈ పోస్ట్ పై సింగర్ చిన్మయి తనదైన శైలిలో స్పందించింది. మగవాళ్ళు పెళ్లికి ముందు అమ్మాయిలతో అలాంటి పనులు చేయడం మానుకోవాలి. మీ అన్నదమ్ముల్ని ఫ్రెండ్స్ ని పెళ్లిదాకా అలాంటి పనులు చేయొద్దని చెప్పండి' అంటూ ఆ పోస్ట్ కు కౌంటర్ ఇచ్చింది. ఈ కౌంటర్ పోస్టు కూడా నెట్టింట్లో వైరల్ అయింది. చిన్మయి ట్వీట్ కు కూడా కౌంటర్ అటాక్ గా.. మరికొన్ని ట్విట్ కు వాటన్నిటికీ దిమ్మతిరిగిపోయేలా ఓ ట్వీట్ చేసింది.
చిన్మయి తన అభిప్రాయానికి మరొక నెట్టిజన్ ను 'జోకర్' అని పిలిచారు. మహిళలు కూడా అలా చేయకూడదని అన్నారు. 'మహిళలు కన్యలు కాదు. పురుషులు ఇప్పటికే లైంగికంగా చురుకుగా ఉన్నారని మహిళలు నమ్ముతారు. మీరందరూ సురక్షితమైన లేదా అసురక్షిత లైంగిక సంబంధం కలిగి ఉన్నారా? అని అడిగే ధైర్యం కూడా చేయరు. ఏమైనప్పటికీ, ఇన్సెల్ సోదరులు ఒక మహిళతో ఒకసారి సెక్స్ చేస్తే, వారు ఆమెను ఎప్పటికీ భ్రష్టు పట్టించారని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. అందువల్ల, పురుషులు తప్పనిసరిగా ఏదో ఒక వ్యాధిని కలిగి ఉండాలి. వారితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించే స్త్రీ ఎప్పటికీ కోలుకోరు. కానీ,పురుషులు భయపడతారు. ఇందులో ఆశ్చర్యం ఏమిటి? అని దిమ్మతిరిగిపో ట్విట్ చేసింది.

చిన్మయి కేవలం తెలుగు లోనే కాకుండా.. హిందీ సినిమాల్లో పాటలు పాడింది. చిన్మయి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు. ఈమె యాక్టర్ రాహుల రవీందర్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్మయి 2006లో సినిమాల్లో తన కెరీర్‌ను ప్రారంభించింది. మస్త్ మగన్, జెహ్నాసీబ్, విజిగలీలే వంటి కొన్ని పాటలకు మంచి పాపులర్టీ వచ్చింది.


Click it and Unblock the Notifications











