సీనియర్ నటి అన్నపూర్ణపై సింగర్ చిన్మయి ఆగ్రహం.. సన్‌సెట్ టు సన్‌రైసే ఆ పనులు చేయాలంటూ!
టాలీవుడ్ టాప్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ టూ ఉద్యమం గురంచి ఎప్పటికప్పుడు షాకింగ్ కామెంట్లు చేస్తూ తన మనసులోని మాటలను నేరుగా చెప్పేస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సీనియర్ నటి అమ్మపూర్ణమ్మపై షాకింగ్ కామెంట్లు చేసింది. విపరీతంగా ఫైర్ అయిపోతూ సెటైరికల్ గా స్పందించింది. అయితే అసలు చిన్మయి అన్నపూర్ణమ్మపై ఎందుకు అంతగా ఫైర్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈక్రమంలోనే ఆమె ఈ తరం అమ్మాయిలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేసింది. ముఖ్యంగా అర్ధరాత్రి 12 దాటాకా బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటని.. అలాగే అంతగా ఎక్స్ పోజింగ్ చేయాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించింది. ఆఫీసుల్లో పని చేసే అమ్మాయిలు అయితే పొట్టి, పొట్టి బట్టలు వేసుకుంటున్నారని.. స్వాతంత్ర వచ్చింది కదా అని అర్ధరాత్రులు బయటకు వెళ్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయంటూ వివరించింది.

అయితే అన్నపూర్ణమ్మ చేసిన ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ కాగా.. వీటిపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. ముందుగా అమ్మపూర్ణమ్మ మాట్లాడిన కామెంట్లను పెట్టి.. ఆ తర్వాత తాను మాట్లాడిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేసింది. ఒక నటిగా ఆమె అంటే తనకు చాలా ఇష్టం అని.. మనం ఎంతో ఇష్టపడే నటులు ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు గుండె చివుక్కుమంటుందని చెప్పుకొచ్చింది. అయినా అమ్మాయిలు అసలు రాత్రిళ్లు బయటకే రాకూడదని.. ముఖ్యంగా అర్ధరాత్రులు ఎవరికీ పిల్లలు కూడా పుట్టకూడదని.. ఆస్పత్రుల్లో కూడా నర్సులు, వైద్యులు అమ్మాయిలు ఉండకూదని చెప్పుకొచ్చింది.
నేను కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతుంటాను కాబట్టి, హెయిర్ లీవ్ చేసి స్టైల్ చేస్తాను కాబట్టి ఆమె కామెంట్లపై స్పందిస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా గ్రామాల్లో ఉండే ఆడాళ్లు ఉదయం 3 గంటలు కాగానే బాత్రూంకు వెళ్లేందుకు గట్లపైకి వెళ్తే.. తమకోసమే వచ్చినట్లు పురుషులు భావించి మనాభంగాలు చేయొచ్చా అని ప్రశ్నించింది. ఇలాంటి సొసైటీలో.. ముఖ్యంగా సంప్రదాయం అంటూ ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్లతో ఈ దేశంలో ఉంటున్నందుకు, పుట్టినందుకు ఏం చేయాలో కూడా తనకు అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అలాగే ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు ఆమె మాట్లాడేది కరెక్టేనా అంటూ అడిగింది. దీనికి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఎందుకు నటిస్తున్నారు మానేయొచ్చు కదా అని కొందరు, ముఖ్యంగా ఆమె కూతురే సూసైడ్ చేసుకుని చనిపోయిందని.. కనీసం కారణం ఏంటో కూడా ఆమెకే తెలియదని.. అలాంటి వాళ్లు అమ్మాయిల గురించి మాట్లాడడం సరికాదంటూ వివరించారు.


Click it and Unblock the Notifications











