‘పక్కన అమ్మ ఉన్నా నన్ను అనుభవించే వాడే.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సింగర్ జీవితం నాశనం’

దక్షిణాది సినీ పరిశ్రమలో ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి ఇండస్ట్రీలో కొనసాగే క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఫర్ ఇచ్చినందుకు శారీరక సుఖాన్ని ఇచ్చే సంస్క‌తి సినిమా పరిశ్రమలో బలంగా ఉంది అంటూ ఆమె తన సోషల్ మీడియాలో సుదీర్ఘమైన లేఖను పోస్టు చేయడం దక్షిణాది సినిమా పరిశ్రమలో కలకలం రేపుతున్నది. దక్షిణాదిలోని పెద్దల పేర్లను రెఫరెన్స్ ఇస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే మన శంకర వరప్రసాద్ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన కామెంట్స్‌ నేపథ్యంలో ఆమె స్పందించి ఉంటారని భావిస్తున్నారు. సింగర్ చిన్మయి పోస్టులో ఏమున్నదనే వివరాల్లోకి వెళితే..

ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇంకా ప్రబలంగా ఉంది. ఫుల్ కమిట్‌మెంట్ ఇవ్వాలనే ఒత్తిడి అమ్మాయిలపై ఉంది. అందుకే వారు తమకు లభించే ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారు. కమిట్‌మెంట్ అనే పదానికి సినిమా పరిశ్రమలో పూర్తిగా డిఫరెంట్ అర్ధం ఉంది. ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన వాళ్లు.. కమిట్‌మెంట్ అంటే.. ప్రొఫెషనలిజం అనుకొంటారు. తాము చేసే పనికి పూర్తిగా న్యాయం చేయాలనే అర్ధం అని అనుకొంటే.. ముమ్మాటికి తప్పే అని చిన్మయి శ్రీపాద అన్నారు.

Singer Chinmayi Sripaada

గొప్ప హోదాల్లో ఉంటే పురుషులు ఏదైనా ఆశించవచ్చనే భ్రమలో ఉంటారు. మహిళల నుంచి శారీరక సుఖాన్ని పొందవచ్చు. లేదా డిమాండ్ చేసే స్థితిలో ఉన్నామని అనుకొంటారు. నాకు తెలిసిన ఓ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెబుతాను. స్టూడియోలో ఓ సింగర్‌పై లైంగిక దాడికి ప్రయత్నిస్తే.. ఆమె సౌండ్ బూత్‌లోకి వెళ్లి ఆ గదిలో తనకు తాను తాళం వేసుకొని బంధించుకొన్నది. ఇండస్ట్రీలోని ఓ సీనియర్ వచ్చి కాపాడేంత వరకు ఆమె అందులోనే ఉంది. ఆ తర్వాత మ్యూజిక్ ప్రొఫెషన్‌ను ఆమె వదిలేసింది. లైంగిక దాడులు, వేధింపులనేది అతిపెద్ద సమస్య అని చిన్మయి షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

లెజెండరీ చిరంజీవి గారు ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తన స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మహిళా నటీనటులతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన తనతో నటించే వారికి, ఆయనకు సహ నటీనటులు ఒకరికొకరు గౌరవించుకొనే సంస్క‌తి కనిపిస్తుంది. వాళ్లంతా ఎంతో మంది లెజెండ్స్‌తో కలిసి పనిచేశారు. అందుకే వారంతా లెజెండ్స్‌గా మారారు అని చిన్మయి అన్నారు.

మీటూ ఉద్యమం కొనసాగే సమయంలో షావుకారు జానకి లాంటి కూడా వేధింపులకు గురిచేసే వారిని కాకుండా మహిళలనే తప్పుపట్టారు. వైజీ మహేంద్ర ఇంటర్వ్యూలో షావుకారు జానకి ఫెమినిస్టుగా ముద్ర వేసుకొన్నారు. ఆ ఇద్దరు కలిసి వర్క్ ప్లేస్‌లో లైంగిక వేధింపులు ఉన్నాయని ఆరోపించిన వారిని, వాళ్ల కుటుంబాలను, స్నేహితులను అవమానించే విధంగా మాట్లాడారు అని ఘాటుగా స్పందించారు.

సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలనుకొనే అమ్మాయిలు విదేశాల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వారు బాగా చదుకొని ఉంటారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అనే విషయంపై పూర్తిగా అవగాహన ఉంటారు కాబట్టి. మీ వ్యక్తిత్వాన్ని చూపే నిజమైన అద్దం ఇండస్ట్రీ కానే కాదు అని ఆమె అన్నారు.

లెజెండరీ రైటర్ వైరముత్తు నుంచి లైంగిక దాడికి గురికాలేదు. కానీ ఆయన నుంచి అలాంటి డిమాండ్ వచ్చింది. ఆ సమయంలో నేను ఇంకా టీనేజ్‌లో ఉన్న యువతిని. ఆయనంటే ఆపారమైన గౌరవం. ఆయనను నేను గురువుగా భావిస్తాను. అలాంటి వృద్ధుడి వల్ల నాకు ఎలాంటి అపాయం కలుగుతుందని ఆలోచించలేదు. కానీ ఆయన నా తల్లి పక్కన ఉన్నా.. నన్ను అనుభవించడానికి ప్రయత్నించే వాడే. పక్కన ఇలాంటి మగాళ్లు ఉంటే.. పక్కన తల్లిదండ్రులు ఉన్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. మహిళలకు మనం వర్క్ ఇస్తున్నాం కాబట్టి.. వారి నుంచి శారీరక సుఖాన్ని పొందాలని మగాళ్లు భావించడమే అసలు సమస్య అని చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X