జాకెట్ లేకపోవడమే మన కల్చర్.. బొక్కలో సలహాలు వద్దు.. మళ్లీ షాక్ ఇచ్చిన సింగర్ చిన్మయి

టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి శ్రీపాద గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సమంత వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఎక్కువగా సామాజిక అంశాలపై స్పందిస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. ఏదైనా సరే ఆమెకు అనిపించింది ఎలాంటి బెరుకు లేకుండా సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తుంటారు. తాజాగా మహిళల వస్త్రాలు, ఇండియన్ కల్చర్ కు సంబంధించిన విషయాలు చెప్పి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

చున్నీ వేసుకోరా : ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయింది. అందులో క్రియేటివ్ గా వీడియోలు చేస్తూ మరికొందరు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. తాజాగా అమ్మాయిలు చున్నీ వేసుకోరు అంటూ తనదైన స్టైల్ లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోలో "ఎద కనిపించకుండా అమ్మాయిలు చున్నీలు వేసుకోవడం లేదు కదా బ్రో.. మనం అయినా చున్నీ వేసుకుందాం. చున్నీ వేసుకుంటే గవర్నమెంట్ వాళ్లకు ఫైన్ వేస్తుందేమో. అందుకే వేసుకోవడం మానేశారు" అని ఒకతను సెటైరికల్ గా అంటాడు.

Singer Chinmayi Sripada

పెట్టికోట్ కల్చర్ : ఇక మహిళలు, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే సింగర్ చిన్మయి శ్రీపాద ఈ వీడియోపై రియాక్ట్ అయి షాక్ ఇచ్చింది. "రవీంద్ర నాథ్ ఠాగూర్ అన్నయ్య, సత్యేంద్ర నాథ్ ఠాగూర్ భార్య జ్ఞాననందిని దేవే ఆడాళ్లు వేసుకునే బ్లౌజ్ (జాకెట్) కల్చర్ ను తీసుకువచ్చింది. జాకెట్స్ తర్వాత పెట్టికోట్ కల్చర్ వచ్చింది. అప్పటి వరకు మీరు చూస్తే 9 గజాల చీరలు, 7 గజాల చీరలు ఉండేవే కానీ, అసలు జాకెట్టే వేసుకునే వారు కాదు" అని చిన్మయి చెప్పింది.

Singer Chinmayi Sripada

దోతీలు కట్టుకోండి : "చీరనే జాకెట్టుగా మడిచి ధరించేవారు. పెట్టికోట్, బ్లౌజ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది కాదు. తర్వాత వచ్చింది. ఇండియన్ కల్చర్ నీకు తెలియదా. చున్నీ వేసుకోవా. ఇటువంటి బొక్కలు, ఇలాంటి డొక్కలు.. వాంతి వచ్చే ఐడియాలు ఇచ్చేవాళ్లు ముందు ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకోండి. మీరు కూడా పంచెలు, దోతీలు కట్టుకోండి. అదే కదా కల్చర్. మరి ప్యాంట్ లు షర్ట్ లు ఎందుకు వేసుకుంటున్నారు" అని చిన్మయి ప్రశ్నించింది.

Singer Chinmayi Sripada

వాళ్ల కోరికల వల్లే : "బ్లౌజ్ లేకుండా ఉండటం చూసి బ్రిటీష్ వాళ్లు చాలా షాక్ అయ్యారు. మహిళల్ని జాకెట్ లేకుండా చూస్తే వాళ్లకు కలిగిన లైంగిక కోర్కెల కారణంగా ఇండియా వాళ్లు బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. బ్లౌజ్ అనేది బ్రిటీష్ వాళ్ల కల్చర్. ఇండియన్ కల్చర్ ఎప్పుడు ఒకరికి సమస్యగా ఉండదు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు పాలు ఇవ్వడం అనేది చాలా కామన్. ఓపెన్ బ్రెస్ట్ ప్లాబ్లమే కాదు. మీ గ్రాండ్ మదర్స్ బ్లౌజ్ వేసుకునేవారే కాదు. ఈ బ్రిటీష్ వాళ్ల కోరికల వల్ల ఈ బ్లౌజ్ కల్చర్ వచ్చింది" అని చిన్మయి చెప్పుకొచ్చింది.

కామంతో చూడకుండా : "జాకెట్ వేసుకుంటేనే ఇండియన్ కల్చర్. ఇది కాకపోతే కాదు అంటున్నారంటే వాళ్లకి హిస్టరీపైన, కల్చర్ పైన నాలేడ్జ్ లేనట్లే. నా మాట మీకు నమ్మకం లేకపోతే గూగుల్ లో చూసి తెలుసుకోండి. బోలేడు ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. దేవాయలయాలపై ఉన్న బొమ్మలకు కూడా బట్టలు ఉండవు. కళ్లు తెరచి మన కల్చర్ ఏంటో తెలుసుకోండి. ముందు బ్రెయిన్ వాష్ చేసుకుని, కామంతో చూడకుండా ఉండండి" అని చెప్పిన చిన్మయి కొన్ని ఫొటోలు కూడా షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X