లైఫ్ గురించి గీతా మాధురి, అషు రెడ్డి షాకింగ్ పోస్టులు.. ఒకేసారి ఇద్దరి రియాక్షన్ ఎందుకలా?
సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో గీతామాధురి ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను పాడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి గీతామాధురి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక గీతామాధురి నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కలరు ఇటీవల కుమారుడు జన్మించిన విషయం కూడా మనకు తెలిసిందే.

ఇకపోతే గీత మాధురి ప్రస్తుతం సింగర్ గా మాత్రమే కాకుండా ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మరోవైపు ఈమె భర్త నందు కూడా సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉండడమే కాకుండా ఇటీవల యాంకర్ గా కూడా మారిపోయారు. ఇలా ఈ దంపతులిద్దరూ కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.
ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే గీతా మాధురి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక కొటేషన్ ఉన్నటువంటి పోస్టును ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె జీవితం గురించి అలాగే సమయం గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చారు.

మన జీవితాన్ని ఎప్పుడూ కూడా కాంప్లికేట్ చేసుకోవద్దని తెలిపారు ఇక్కడ మనం ఎప్పటి వరకు ఉంటామో తెలియదు అందుకే మనకున్నటువంటి ఈ సమయాన్ని విలువైన వాటికి ఉపయోగించుకోవాలని తప్ప అర్థం లేని వాటికోసం సమయాన్ని వృధా చేసుకుంటూ జీవితాన్ని ఇబ్బందులలో పడేయకూడదనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇకపోతే ఇదే పోస్టును నటి అషు రెడ్డి ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో ఈ పోస్టులు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిపోయి. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











