మొన్నటి వరకూ విడాకులన్నారు.. కానీ రెండోసారి తల్లవుతున్నానంటూ క్లారిటీ ఇచ్చిన సింగర్.. ఎవరంటే?

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చాలానే శుభ కార్యాలు జరుగుతున్నాయి. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వాళ్లు అవుతున్నారు. అలాగే మరికొంత మంది స్టార్ కపుల్స్ విడాకులు కూడా తీసుకుంటున్నారు. కానీ బ్యాడ్ న్యూస్ లకంటే కూడా ఎక్కువగా ఈ ఏడాది గుడ్ న్యూస్ లే వినిపిస్తున్నాయి. మొన్నే వరుణ్ తేజ్, లావణ్యలు పెళ్లి చేసుకోగా.. తాజాగా అభిరామ్ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లిళ్ల విషయాలు పక్కన పెడితే... టాలీవుడ్ కు చెందిన కొంతమంది హీరోలు తండ్రులు కాబోతున్నట్లు చెప్పారు. హీరో నిఖిల్ సిద్దార్థతో పాటు శర్వానంద్ లు తండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ సింగర్ కూడా మరోసారి తల్లి కాబోతున్నట్లు చెప్పింది. ఆమె మరెవరో కాదు సింగర్ గీతా మాధురి. 38 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ.. 2014లో సినీ రంగానికి చెందిన నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలగా 2019లో ఓ పాప కూడా పుట్టింది. అయితే ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అనే అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పేరును పెట్టారు. ఇక ఆ తర్వాత రెండేళ్ల నుంచి వీరిద్దరూ కలిసి ఉండడం లేదంటూ వార్తలు వచ్చాయి.

Singer Geetha Madhuri Get Prgenancy in Second Time Check Details

త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకుబోతున్నారంటూ కొందరు, ఇప్పటికే తీసేసుకున్నారంటూ మరికొందరు పెద్ద ఎత్తున వార్తలు రాసుకొచ్చారు. దీనిపై వీరిద్దరూ కలిసి ఓ సారి స్పందించనప్పటికీ... చాలా మందికి అనుమానమే ఉండేది. అయితే ఇప్పటికీ అలాంటి వార్తలును నమ్ముతున్నవారికి గట్టి షాకిచ్చింది సింగర్ గీతా మాధురి. తాను రెండో సారి తల్లి కాబోతున్నట్లు చెప్పి... తామిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో ఇండైరెక్టుగా చెప్పేసింది. ఇంత మంచి గుడ్ న్యూస్ మరింత స్వీట్ గా షేర్ చేసింది గీతా మాధురి. పాటలు పాడినంత తియ్యగా ఎలా వార్తను అందరికీ తెలిపిందో మనం ఇప్పుడు చూద్దాం.

Singer Geetha Madhuri Get Prgenancy in Second Time Check Details

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సింగర్ గీతా మాధురి ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఈ గుడ్ న్యూస్ ను వివరించింది. ముఖ్యంగా తన కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. కింద తన కూతురు దాక్షాయణి ప్రకృతి 2024వ సంవత్సరంలో ఫిబ్రవరిలో అక్క కాబోతుందంటూ చెప్పుకొచ్చింది. ఇలా చాలా స్వీట్ అండ్ క్యూట్ గా గుడ్ న్యూస్ చెప్పిన గీతా మాధురి, నందుల జంటకు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజెన్లు. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త వైరల్ గ మారింది. మీరూ ఓసారి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X