Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర షాకింగ్ రియాక్షన్..
టాలీవుడ్‌లో ప్రముఖ సింగర్ జంట హేమచంద్ర-శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారనే ఊహాగానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పేజీలు వీరి వ్యక్తిగత జీవితంపై నిరంతరం పోస్టులు పెడుతుండటంతో ఫ్యాన్స్ కూడా గందరగోళంలో ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ ఇద్దరూ కలిసి స్టేజ్ షోల్లో, మ్యూజికల్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ ఎంటర్టైన్‌మెంట్ రంగంలో కొనసాగుతున్నారు. పబ్లిక్ ప్రెజెన్స్ కూడా ఉండటంతో వీరి మ్యారిడ్ లైఫ్ 'స్టేబుల్' అన్న భావన చాలామందిలో ఏర్పడింది. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే ప్రచారం వేరే లెవల్ లో సాగుతోంది. ఈ రూమార్స్ పై సింగర్ హేమ చంద్ర స్పందించారు.
టాలీవుడ్ సంగీత ప్రపంచంలో తన స్వరంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమచంద్ర.. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్లకు తాజాగా ఘాటైన సమాధానం ఇచ్చారు. తెలుగు చిత్రసీమకు ఎన్నో హిట్ సాంగ్స్ అందించిన ఆయన, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో తన సహా గాయని శ్రావణ భార్గవిని ప్రేమించి, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, మ్యూజికల్ జంటగా చేసిన ఈవెంట్స్ చూసి అభిమానులు వీరిని ఆదర్శ జంటగా భావించారు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో "విడాకులు అయ్యాయి", "వీరు విడిపోయారు" అనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఈ విడాకుల వార్తలు మళ్లీ వైరల్ కావడంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సింగర్ హేమచంద్రను ఈ అంశంపై యాంకర్ ప్రశ్నించారు. "మీ వైవాహిక జీవితం గురించి రూమర్స్ వస్తున్నాయి, కానీ మీరు స్పందించలేదు. క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు?" అని ప్రశ్నించగా.. హేమచంద్ర కఠినంగా స్పందించారు. వ్యక్తిగత విషయాలపై తనకు వచ్చే కామెంట్లు ప్రభావం చూపవని, ఇతరుల కుతూహలానికి తాను బలి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. "ఏ వార్త అయినా అది నిజమైనా, అబద్ధమైనా... అది మీకు ఏ ఉపయోగం?" అని హేమచంద్ర ప్రశ్నించారు. "మీరు తెలుసుకోవడం వల్ల మీ జీవితంలో మార్పేమైనా వస్తుందా? నేను సింగర్‌గా చేస్తున్న పనిపై మాట్లాడండి, కానీ నా వ్యక్తిగత జీవితం గురించి కాదు" అని ఆయన గట్టిగా చెప్పారు. తనపై వచ్చే కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ ఎలాంటి ప్రభావం చూపదని, వ్యర్థమైన చర్చలతో తన సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.
"నేను సింగర్‌గా తెలిసిన వ్యక్తిని. నా పనికి సంబంధించిన ప్రశ్నలు అడుగు. నేను మాట్లాడితే కనీసం ఒకరికి ప్రేరణ కావాలి. ఖాళీ రూమర్ల కోసం మాట్లాడను," అని ఆయన తేల్చి చెప్పారు. హేమచంద్ర ఇంకాస్త ముందుకు వెళ్లి, ప్రజలు ఆసక్తి చూపుతున్న పర్సనల్ లైఫ్ విషయాలకు పరిమితులు ఉంటాయని తెలిపారు. "ఎవరైనా నిజంగానే తెలుసుకోవాలనుకుంటే, ఓ పబ్లిక్ లో సెషన్ పెట్టాం అనుకోండి... నేను వారికి ఒకే ప్రశ్న అడుగుతా ఈ విషయం తెలుసుకోవడం వల్ల నీకు ఉపయోగమేంటీ?" అప్పుడు చెప్పబడే సమాధానం తనను ఒప్పిస్తేనే ఆయన స్పందిస్తానని చెప్పారు. "జనం ఇతరుల జీవితాల్లో ఓపిక లేకుండా తవ్వుతారు. ఒకరి ప్రొఫెషన్ గురించి మాట్లాడితే అది విలువైన సంభాషణ. కానీ వారి కుటుంబం, వ్యక్తిగత నిర్ణయాల గురించి కాదు," అని ఆయన స్పష్టం చేశారు.
ఈ మాటలతో హేమచంద్ర రూమర్లను పూర్తిగా ఖండించకపోయినా, తాను ఆ ఊహాగానాల బారిన పడబోనని, తన వ్యక్తిగత విషయాలను పబ్లిక్ వేదికపై చర్చించబోనని బలంగా తెలియజేశారు. ఆయన స్పందన సోషల్ మీడియాలో వైరల్ కాగా, అభిమానులు "అయితే నిజమెంత?" అనే సందేహంతోనే మిగిలిపోయారు. హేమచంద్ర-శ్రావణ భార్గవి జంట విడిపోయారా లేదా అన్న విషయానికి ఇప్పటికీ అధికారిక క్లారిటీ లేకపోవడంతో, ఈ చర్చ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే హేమచంద్ర లేదా శ్రావణ భార్గవి పూర్తి క్లారిటీ ఇవ్వాలి. వారి వ్యక్తిగత జీవితంపై ఏ నిర్ణయం తీసుకున్నా, అది వారు అధికారికంగా ప్రకటించే వరకు వారికి గౌరవం ఇవ్వడం అభిమానులు తమ బాధ్యతగా భావించాలి.


Click it and Unblock the Notifications











