Singer Kalpana: సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆత్మహత్యాయత్నం కేసులో భర్త అరెస్ట్?
దక్షిణాది భాషల్లో ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించడం సినీ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. హైదరాబాద్ నిజాంపేటలోని ఓ గేటెడ్ హౌస్ ప్రాంతంలో నివాసముంటున్న ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ ప్రయత్నం చేశారు. ఇంటి తలుపులు రెండు రోజులుగా తెరవకపోవడంతో ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. పడక గదిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కల్పన ఆత్మహత్యాయత్నం కేసు వివరాల్లోకి వెళితే..
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు కల్పన హైదరాబాద్‌లోని నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ నివాస సముదాయంలో ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆమె తీవ్ర మనస్తాపం చెంది కలత చెందినట్టు స్నేహితులు, సన్నిహితులు గ్రహించారు. అయితే ముభావంగా ఉంటున్న ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకొన్న పోలీసులు ఆమెను వెంటనే స్థానిక హోలిస్టిక్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అపస్మారక స్థితిలోకి జారుకొన్న ఆమెకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కల్పన భర్త చెన్నైలో ఉండగా ఆయనకు సమాచారం అందించారు. దాంతో ఆయన వెంటనే హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హాస్పిటల్‌లో కల్పనను చూసేందుకు వచ్చిన భర్తను పోలీసులు ముందుగా ఇంటికి తీసుకెళ్లి ప్రాథమిక విచారణ జరిపించారు. అనంతరం అదుపులోకి తీసుకొని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కల్పన సూసైడ్ అటెంప్ట్‌కు దాంపత్య జీవితంలో ఏవైనా కలహాలు, విభేదాలు కారణమయ్యాయా? లేదా ఇంకా ఏదైనా సమస్యలు ఈ పరిస్థితికి దారి తీసేలా చేశాయా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో తనకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశానని చెప్పిన విషయం మీడియాలో ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











