లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. చివరి వరకు పోరాడుతూ..
దిగ్గజ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ ఇకలేరు. కొద్ది రోజులుగా కరోనావైరస్ బారిన పడిన ఆమె ఇతర ఆనారోగ్య కారణాలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం (ఫిబ్రవరి 6వ తేదీన) తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. లతా మంగేష్కర్ మరణ వార్తతో సంగీత ప్రపంచం మూగబోయింది. ఆమె మృతి వార్తతో పలువురు సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలు, కోట్లాది అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ సంతాపం ప్రకటిస్తున్నారు. లతా మంగేష్కర్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో
జనవరి 28వ తేదీన ఆమె కొద్దిగా కొలుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. అనంతరం వెంటిలేటర్ నుండి తొలగించబడ్డారు. అయితే, ఫిబ్రవరి 5 న, ఆమె పరిస్థితి క్షీణించడంతో వైద్యులు గత రాత్రి నుంచి చాలా కష్టపడి ఆమె ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆమె తిరిగి వెంటిలేటర్ పైకి తీసుకు వెళ్లారు.

సినీ ఇండస్ట్రీ షాక్
లతా మంగేష్కర్ కేవలం హిందీలోనే కాకుండా తెలుగు తమిళ్ మలయాళం భాషలో చాలా వైవిధ్యమైన పాటలను పాడారు. ఇక ఆమె హఠాత్తుగా మరణించారు అని తెలియగానే అందరూ షాక్ అయ్యారు. ఇక వైద్యులు లతా మంగేష్కర్ ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ ఆరోగ్యం సహకరించలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











