Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Singer Mangli: హీరోయిన్ గా సింగర్ మంగ్లీ.. 6 రాష్ట్రాల కథతో పాన్ ఇండియా సినిమా!
సింగర్ మంగ్లీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె జానపద పాటలకు పెట్టింది పేరు. బతుకమ్మ, బోనాలు, గణేష్ చతుర్థి, సమ్మక్క సారక్క, శివుడిపై ఎన్నో పాటలు పాడి చాలా ఫేమస్ అయింది. ఇలా మంగ్లీ పాడిన అనేక పల్లె పాటలకు వచ్చిన ఆదరణ చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. అందుకే తర్వాత ఆమెకు సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. ఇక ఇటీవల రవితేజ ధమాకా సినిమాలోని జింతాక సాంగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇంతకాలం సింగర్ గా వెలుగొందిన మంగ్లీకి సంబంధించిన ఆసక్తికరమైన ఓ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

హీరోయిన్స్ గా మారిన సింగర్స్..
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో బాల నటీనటులు హీరోలు, హీరోయిన్స్ గా అడుగుపెట్టడం తెలిసిన విషయమే. అలాగే రైటర్స్ దర్శకులుగా మారినట్లు.. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు గా చేసి ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా రంగప్రవేశం చేయడం కూడా చిత్రసీమలో చూశాం. అలాగే సింగర్స్ సైతం వెండితెరపై తళుక్కుమన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఇటీవలే పాపులర్ సింగర్ షిర్లీ సేఠియా కృష్ణ వ్రింద విహారి సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది.

బంజారా కుటుంబంలో..
ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఫేమస్ సింగర్ మంగ్లీ హీరోయిన్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సింగర్ మంగ్లీగా చాలా పాపులర్ అయిన ఆమె అసలు పేరు సత్యవతి. ఏపీలోని అనంతరపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తండాలో పేద బంజారా కుటుంబంలో జన్మించిన మంగ్లీ RDT (Rural Development Trust) సంస్థ ద్వారా చదువుకుని పాటలు పాడటం నేర్చుకుంది. అదే సంస్థ ఆర్థిక సహాయంతో.. తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. అనంతరం ఎస్వీ విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో జాయిన్ అయింది.

తెలంగాణ యాసతో..
ఆర్డీటీ చొరవతో సంగీతంపై పట్టు పెంచుకుని సంగీత విద్యాలయంలో పూర్తి మెళవకువలు నేర్చుకుంది. ఆ తర్వాత తన కెరీర్ మొదలు పెట్టి తెలంగాణలో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ముందుగా జానపద గీతాలతో ప్రయాణం మొదలుపెట్టిన మంగ్లీ.. ఓ టీవీ ఛానెల్ లో మాటకారి మంగ్లీ పోగ్రామ్ ద్వారా ఫుల్ పాపులర్ అయింది. అందులో తెలంగాణ యాసతో ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంది. ఎంటర్టైన్ మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డ్ సైతం గెలుచుకుంది మంగ్లీ.

సినిమాల్లో కీలక పాత్రలు..
యాంకర్ గా సింగర్ గా పేరు తెచ్చుకుంది మంగ్లీ. ఇక రేలా.. రేలా.. రే పాటతో సెలబ్రిటీ సింగర్ గా మారిపోయింది మంగ్లీ. అనంతరం గోర్ జీవన్ అనే లంబాడీ చిత్రంలో లంబాడ ఆడ పిల్లలను కాపాడుకునే యువతిగా నటించి ఆకట్టుకుంది సింగర్ మంగ్లీ. టాలీవుడ్ సింగర్ గా ఫుల్ పాపులర్ అయిన మంగ్లీ.. స్వేచ్ఛ, గువ్వ గోరింక సినిమాలతోపాటు నితిన్ నటించిన మ్యాస్ట్రో సినిమాలో కీలక పాత్ర పోషించింది.

కన్నడలో పాటలు పాడిన మంగ్లీ..
ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది సింగర్ మంగ్లీ. ఓ పాన్ ఇండియా సినిమాలో కథానాయికగా సింగర్ మంగ్లీ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. చక్రవర్తి చంద్రచూడ్ దర్శకత్వంలో 'పాదరాయ' అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో మంగ్లీ హీరోయిన్ గా నటించనుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను బెంగళూరులో ప్రకటించారు. అయితే తెలుగులోనే కాకుండా కన్నడలోనూ తన పాటలతో అలరించిన మంగ్లీ ఇప్పుడు అదే కన్నడ సినిమాలో హీరోయిన్ గా చేయనుంది.

6 రాష్ట్రాలకు సంబంధించిన కథ..
ప్రస్తుతం పాదరాయ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాలో హీరోగా నాగ శేఖర్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కు ముందు హీరో నాగ శేఖర్ 42 రోజులపాటు హనుమత్ వ్రతాని పాటిస్తున్నారని టాక్. ఇటీవలే ఆయన అంజనాద్రి కొండల్లో మాల వేసుకున్నారట. 2013-2014 సంవత్సరాల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా పాదరాయ సినిమాను రూపొందించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమా కథ ఆరు రాష్ట్రాలకు సంబంధించి ఉంటుందని చెబుతున్నారు. ఆర్ చంద్రు నిర్మిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చారు.