Singer Mangli: భారీ స్కాంలో మంగ్లీ పేరు.. కోట్లలో మోసం.. అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో తన గానంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ (Singer Mangli). ఇటీవల ఈ సింగర్ పేరు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. 'సర్కే చునర్ తేరి సర్కే' సాంగ్ తో కాంట్రావర్సీ లో చిక్కున్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా మంగ్లీపేరు మారుమోగింది. బూతు పాట పాడటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తాను తప్పు చేశానంటూ మంగ్లీ క్షమాపణ చెప్పింది. అయితే.. ఈ వివాదం పూర్తిగా ముగిసిపోకముందే.. ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Also Read
20 రోజుల షూట్.. 10 రోజుల డబ్బింగ్ వృథా? పుష్ప 2 పై బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన..
20 రోజుల షూట్.. 10 రోజుల డబ్బింగ్ వృథా? పుష్ప 2 పై బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన..

తాజాగా ఆమె పేరుతో భారీ మోసం జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో కొందరు వ్యక్తులు మంగ్లీ పేరు వాడుకుని కోట్లలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీ స్వయంగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే.

Singer Mangli Fraud Controversy

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలపై మంగ్లీ పేరుతో రూ.150 కోట్ల స్కామ్ జరిగిందని, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇందులో భాగమయ్యారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆమె తమ్ముడు శివ పేరు కూడా ఈ వ్యవహారంలో వినిపించడం, ఇంట్లో కరెన్సీ కట్టల వీడియోలు బయటకు రావడం వంటి అంశాలు ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. అయితే ఈ వార్తలన్నింటినీ మంగ్లీ ఖండిస్తూ, తనకు ఈ ఫైనాన్స్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Recommended For You
Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి హేమ..
Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి హేమ..

సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో మంగ్లీ మాట్లాడుతూ... 'మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. నాకు ఆ వ్యక్తులతో, వారి వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం మాత్రమే నన్ను, నా తమ్ముడిని సంప్రదిస్తారు. ఆహ్వానాలు, ఈవెంట్ వివరాల వరకే మా సంబంధం ఉంటుంది. వారి వ్యక్తిగత వ్యాపారాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు' అని పేర్కొంది.

You May Also Like
ఆ స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా..ఇక బాక్సాఫీస్ రికార్డులు దద్దరిల్లాల్సిందే..
ఆ స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా..ఇక బాక్సాఫీస్ రికార్డులు దద్దరిల్లాల్సిందే..

అలాగే, తన పేరును వాడుకుని మోసాలకు పాల్పడడం చాలా అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 'కావాలని కొందరు నా పేరు, ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ వీడియోలకు మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషన్ ఈవెంట్స్ తప్ప నాకు మరే ఇతర వ్యాపారాలు లేవు' అని స్పష్టం చేసింది.

Dhurandhar 2: ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌.. రణ్‌వీర్‌తో దీపిక కలిసి..
Dhurandhar 2: ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌.. రణ్‌వీర్‌తో దీపిక కలిసి..

ప్రజలకు కూడా ఆమె ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. 'నా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నాను" అంటూ వెల్లడించింది. ఈ ప్రకటనతో ఈ వివాదానికి కొంతవరకు క్లారిటీ వచ్చినప్పటికీ, అసలు ఈ మోసం వెనుక ఎవరు ఉన్నారు? అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి.

Dhurandhar 2 Collections: ఓవర్సీస్‌లో ధురంధర్ రికార్డు కలెక్షన్స్.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Dhurandhar 2 Collections: ఓవర్సీస్‌లో ధురంధర్ రికార్డు కలెక్షన్స్.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇటీవల మంగ్లీ చుట్టూ వరుస వివాదాలు నెలకొనడం గమనార్హం. 'కేడీ: ది డెవిల్' సినిమాలో ఆమె పాడిన 'సర్కే చునర్ తేరి' పాటపై అసభ్యకర లిరిక్స్ ఉన్నాయంటూ విమర్శలు రావడంతో ఆ పాటను తొలగించారు. అంతకుముందు ఆమె బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ వాడారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తారు? అసలు నిందితులు ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: singer mangli tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X