twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీ.. ఆఫ్రికన్ తో బోనాల పాట, కొత్త టెన్షన్!

    |

    యాంకర్ గానే కాకుండా సింగర్ గా నటిగా కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్న మంగ్లీ ఇప్పుడు అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. అసలు ఏమైంది ? మంగ్లీ పాటలో వివాదం ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Bonalu 2021 : Mangli బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లిరిక్ మార్చాల్సిందే..!! || Oneindia Telugu
     తీన్మార్ వార్తలతో

    తీన్మార్ వార్తలతో

    ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సింగర్ మంగ్లీ తీన్మార్ వార్తలతో మొదట మంచి క్రేజ్ అందుకుని ఆ తర్వాత సింగర్ గా యూ టర్న్ తీసుకుని అతి తక్కువ కాలంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను గెలుచుకుంది. ఇక ఆమె పాడిన పాటలు యూ ట్యూబ్ లో ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రేలారే అంటూ తెలంగాణకు సంబంధించిన సాంగ్స్ తో క్రేజ్ అందుకొని అనంతరం సినిమాల్లో కూడా పాడే స్థాయికి ఎదిగింది.

     ప్రతి పండుగకి

    ప్రతి పండుగకి

    అల వైకుంఠపురములో.. రాములో రాములో ఫిమేల్ సింగర్ గా క్లిక్ అయిన విషయం తెలిసిందే. ఇవి కాకుండానే తెలుగు రాష్ట్రాల పండగలకు ప్రతి ఏటా ప్రత్యేక పాటలు రూపొందించి విడుదల చేస్తుంటారు. ఆ సాంగ్స్‌ రిలీజ్ చేసిన ప్రతి సారీ .కోట్లాది వ్యూస్ సంపాదించాయి. ప్రస్తుతం తెలంగాణలో బోనాల సీజన్ కావడంతో ఆమె ఒక బోనాల పాట విడుదల చేసింది. ఈ పాట ఇప్పుడు యూబ్యూబ్‌ను ఒక ఊపు ఊపుతోంది.

    మోతువరి లెక్క

    మోతువరి లెక్క

    జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌‌లో విడుదలైన ఈ పాటకు.. ఇప్పటికే 50 లక్షలకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. అంతా బాగానే ఉన్నా ఈ పాట కోసం రాసిన లిరిక్స్ కొంప ముంచేలా ఉన్నాయి. 'చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క , మోతువరి లెక్క ఓ మైసమ్మా..' అంటూ సాగే ఈ పాట ఇప్పుడు బోనాల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ పదాలు సరిగ్గా లేవని అంటున్నారు.

    ఆఫ్రికా కుర్రాడితో కలిసి

    ఆఫ్రికా కుర్రాడితో కలిసి

    ఆఖరికి గ్రామ దేవతలను కూడా వదలట్లేరు, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు.... అమ్మని తిట్టుకుంటూ పాట పాడడం... డాన్స్ చేయడం..... ఎం నేర్పిస్తున్నారు??? క్షమాపణ చెప్పి లిరిక్స్ మార్చాల్సిందే అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటకు రామస్వామి లిరిక్స్ అందించగా, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ మంగ్లీ స్వయంగా పాడగా ఢీ ఫేమ్ పండు కొరియోగ్రఫీ అందించారు. ఈ మధ్య కాలంలో షోలలో కనిపిస్తున్న ఆఫ్రికన్ కుర్రాడు చిచ్చా చార్లెస్ కూడా కనిపించాడు.

    కళ్లు నెత్తికెక్కాయి

    కళ్లు నెత్తికెక్కాయి

    ఇక పాటలోని కొన్ని లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శిస్తున్నట్లు ఉన్నాయని కొందరు భక్తుల వాదన. భక్తుల మొక్కులు, పూజలు చెట్టు కింద కూర్చున్న నీకు కనిపించినా.. మొక్కులు తీర్చడం లేదని అంటూ అర్థం వచ్చేలా ఉండడం వివాదానికి కారణమైంది. కొద్దిగా ఫేమ్ రాగానే కళ్లు నెత్తికెక్కాయని కొందరు భక్తులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

    English summary
    Telugu popular folk singer Satyavathi, also known as Mangli, came up with a new song during the Bonalu festival. this songs landed in trouble.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X