మంగ్లీ నోట రోత పాట.. దేశవ్యాప్తంగా నెటిజన్ల నిరసన, కంగన ఆగ్రహం

కన్నడ సినీ రంగంలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా నటించిన తాజా చిత్రం కేడీ: ది డెవిల్. దర్శకుడు ప్రేమ్స్ డైరెక్షన్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, శిల్పాశెట్టి, వీ రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తుండగా, విలియం డేవిడ్ సినిమాటోగ్రఫిని, మోహన్ బీ కెరే ఆర్ట్ డైరెక్టర్‌గా, రాజు సుందరం, ప్రభుదేవా, రాహుల్ తదితరులు కోరియోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను భారీగా ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ నోరా ఫతేహీ, సంజయ్ దత్‌పై చిత్రీకరించిన పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే సింగర్ మంగ్లీ పాడిన పాటలో సాహిత్యం అశ్లీలత, అసభ్యతతో ఉండటంతో అభ్యంతరాలు, నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ పాట వెనుక వివాదం వివరాల్లోకి వెళితే..

Singer Mangli s KD The Devi Song backlash online

హిందీలో ఈ పాటను రాకీబ్ ఆలమ్ రాయగా,.. సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ ఆలపించారు. ఈ పాట విషయానికి వస్తే.. పహ్లే ఉఠాలే.. అందర్ వో డాలే.. నీచే ఏక్ బుంద్ నా గిరాయే..కర్కే నికాలే ఖాళీ..ముఝ్ పే గిరేనా లగ్తా హై డర్.. అంటూ ఈ పాట సాగుతుంది. అయితే పూర్తిగా ద్వందార్థం ఉట్టిపేడేలా పాట సాహిత్యం ఉంది. దాంతో ఈ పాటపై రాజకీయ నేతలు, మీడియా, సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమర్షియల్ పాటల పేరుతో సంగీతాన్ని, సాహిత్యాన్ని బ్రష్టుపట్టించారు నిరసన గళాన్ని వినిపించారు.

సర్కే చునర్ తెరీ సర్కే అంటూ సాగే పాటపై బాలీవుడ్ నటి, ఎంపీ కంగన రనౌత్ తీవ్రంగా మండిపడ్డారు. అశ్లీలత, అసభ్యత విషయంలో బాలీవుడ్ అన్ని రకాలు హద్దు మీరింది అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కేడీ ది డెవిల్ సినిమాలోని పాటను వెంటనే తొలగించాలని పలువురు సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడం, వివాదం పెరిగి పెద్దది అవుతుండటంతో ఈ పాటకు సంబంధించి హిందీ వెర్షన్‌‌ను తొలగించారు. అయినా ఈ సినిమా పాటపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ పాటను మంగ్లీ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎలా పాడారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ పాట తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. నోరా ఫతేహీ, సంజయ్ దత్ జంటపై జరిపేయ్ నాత్ పండుగ జరిపేయ్ అంటూ సాగే పాట మాస్ బీట్‌తో యూత్‌ను టార్గెట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఈ పాటలో రాజు సుందరం కంపోజ్ చేసిన స్టెప్పులు, వాటిని తెరకిక్కించిన విధానం చర్చనీయాంశమైంది. నోరా గ్లామర్ ట్రీట్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య కంపోజ్ చేసిన మాస్ సాంగ్‌ను సింగర్ మంగ్లీ ఆలపించారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ సాహిత్యం అందించారు. ఈ పాట సాహిత్యంపై కూడా సంగీత ప్రియులు పెదవి విరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X