కరడు గట్టిన విలన్‌గా రఘు కుంచే.. ఆకట్టుకొంటున్న పలాస 1978 ఫస్ట్‌లుక్
యాంకర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న
రఘు కుంచే సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్‌లోకి నటుడిగా అడుగుపెట్టనున్నారు. పలాస 1978 మూవీలో విలన్ పాత్రలో నటించారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ రిలీజై ఆకట్టుకొంటున్నది. ఇప్పటికే రఘు కుంచె రోల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పలాస 1978 చిత్రంలో రఘు కుంచె పోషిస్తున్న పాత్ర సాదా సీదా విలన్ కాదు. నాలుగు విభిన్నమైన పాత్రల్లో, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ పాత్ర చేయబోతున్నాడు. పలాస 1978కు
రఘు కుంచే మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుండటం మరో విశేషం.

ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్, రఘు విలన్ పాత్రకు సూటవుతారని ఫిక్స్ చేశారు. .ఈ క్యారెక్టర్‌లో నాలుగు విభిన్నమైన వయసులో కనిపించే పాత్రనుచేస్తున్నాను అని అన్నారు.
దర్శకుడు కరణ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో 30-40-50-70 వయసుతో కనిపించే పాత్రల్లో రఘు కనపించబోతున్నారు.
రియలిస్టిక్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న పలాస 1978 చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ''పలాస 1978'' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు.

సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ
పాటలు: సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, భాస్కర భట్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్సంగీతం : రఘు కుంచే
పి.ఆర్.ఓ: జి.ఎస్.కె మీడియా
నిర్మాత : ధ్యాన్ అట్లూరి
రచన, దర్శకత్వం : కరుణ కుమార్


Click it and Unblock the Notifications











