Ramana Gogula: రమణ గోగుల గుండు వెనక ఇంత కథ ఉందా?

Ramana gokula: రమణ గోగుల.. ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరంటే అతిశక్తి కాదు. చాలా ఏళ్ల క్రితం తెలుగులో అద్భుతమైన పాటల అందించారు సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల. ఎన్నో హిట్ పాటలకు సంగీతం అందించి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పాపులరిటీ సొంతం చేసుకున్నారు. ఆయన మ్యూజిక్ కాదు.. ఆయన స్టైల్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. రమణ గోగుల నిత్యం గుండు తో కనిపిస్తారు. అయితే అలా గుండుతో కనిపించడానికి ఓ ఎమోషనల్ కథ ఉందట ఇంతకీ ఆ కథ ఏంటో లుక్కెయ్యండి.

రమణ గోగుల.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు.. తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, యోగి లక్ష్మి జానీ వంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రమణ గోగుల మ్యూజిక్ ఉండాల్సిందే. యూత్లో ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు కూడా ఉండేది. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైనా రమణ గోగుల.. దాదాపు 11 సంవత్సరాల తర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు.

singer Ramana Gogula revealed the actual story behind his bald head

విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో రమణ గోకుల సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో గోదారి గట్టుమీద రామచిలుకవే.. అనే పాటను పాడారు. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ స్వరాలు సమకూర్చగా.. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో రమణ గోగుల పేరు తెలుగు ఇండస్ట్రీలో మరోసారి మారుమోగుతుంది

ఈ తరుణంలో రమణ గోగుల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రమణ గోగుల తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను పంచుకున్నారు. అలాగే ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ తరుణంలో రమణ గోగుల గుండు యాంకర్ ప్రశ్నించగా.. తనది ఒరిజినల్ గుండు కాదని తాను ఎప్పటికప్పుడు జుట్టును గీకేస్తానని అసలు విషయం బయట పెట్టాడు.అలా చేయడానికి ఓ కారణం ఉందంటూ ఓయ్ ఎమోషనల్ స్టోరీని చెప్పుకొచ్చారు.

singer Ramana Gogula revealed the actual story behind his bald head

పవన్ కళ్యాణ్ తో జానీ మూవీ చేసే సమయంలో తన భార్య ప్రెగ్నెంట్ అని, అయితే డెలివరీ కావడం కష్టమని డాక్టర్లు చెప్పారంట. ఈ విషయాన్ని ఆలోచించుకుంటూ ఆఫీస్ కి డల్లుగానే వెళ్ళాడు. ఈ సమయంలో తన ట్రూప్ లోని కీబోర్డ్ ప్లేయర్ తన దగ్గరికి వచ్చి ఏమైందంటూ ఆరా తీశారట. దీంతో రమణ గోగుల అసలు విషయాన్నీ అతడికి చెప్పాడు. ఈ తరుణంలో ఆ వ్యక్తి.. మీరే మాట్లాడకుండా తిరుపతికి వెళ్ళండి సార్.. అంతా సెట్ అయిపోతుందని సలహా ఇచ్చాడట.

సరే అని వెళ్లి అక్కడ గుండు చేయించుకుని దేవుని దర్శనం చేసుకున్నాడట. ఆ తర్వాత తన భార్యకు నార్మల్ డెలివరీ అయ్యిందట. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారట. ఆ క్షణంలోని జీవితంలో తాను జుట్టు పెంచుకోనని రమణ గోగుల డిసైడ్ అయ్యారట. భార్య కోసం రమణ గోగుల ఇంత సహాయం చేశారని అందరూ షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X