గాయకుడు సోను నిగమ్‌కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక
ప్రముఖ గాయకుడు సోను నిగమ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌కు తరలించారు. మ్యూజిక్ ప్రోగ్రాం కోసం ప్రస్తుతం సోను నిగమ్ నేపాల్‌లోని పొఖారాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో ఖాట్మండ్‌లోని నోర్విక్ హాస్పిటల్‌లో చేర్పించారు.

నోర్విక్ వీఐపీ లాంజ్ హస్పిటల్‌లో సోను నిగమ్ చికిత్స పొందుతున్నారు. వెన్ను నొప్పి కారణంగా హాస్పిటల్ చేరాడు. ఎంఆర్ఐ, తదితర పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల కోసం వేచి చూస్తున్నాం. ప్రముఖ వైద్యులు పంకా జలన్, ప్రవీణ్ నేపాల్ పర్యవేక్షిస్తున్నారు. ఎదైనా తీవ్రతరమైతే ట్రీట్‌మెంట్ కోసం భారత్ తరలించడానికి సిద్ధంగా ఉన్నాం అని మేనేజర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











