Sreerama Chandra: "కళ్లల్లోకి కళ్లు పెట్టి చూశా.. బ్యాగ్ సర్దుకొని మరీ ఆ అమ్మాయి ఇంటికొచ్చేసింది!"
సింగర్ శ్రీరామ చంద్ర గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన గాత్రం కల్గిన ఈయన అనేక పాటలు పాడి అందరినీ ఉర్రూతలూగించండి. కేవలం సింగర్ గానే కాకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా ఓ షోలో పాల్గొన్నాడు. అక్కడే తన గురించి తన ప్రేమ కథల గురించి వివరించాడు. ముఖ్యంగా తాను కళ్లల్లోకి కళ్లు పెట్టి ఎవరిని చూసినా తనతో ప్రేమలో పడిపోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తనకోసం ఓ అమ్మాయి బ్యాగ్ సర్దుకొని మరీ ఇంటికొచ్చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం 38 ఏళ్ల వయసు కల్గిన సింగర్ శ్రీరామ చంద్ర.. 2005 నుంచే పాటలు పాడుతున్నాడు. 2010 సంవత్సరంలో ఇండియన్ ఐడల్ లో విజయం సాధించగా.. అందరికీ ఈయన గురించి తెలిసింది. ఇక ఆ తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో అకనే పాటలు పాడారు. ఇప్పటి వరకు సింగర్ శ్రీరామ చంద్ర అన్ని భాషల్లో కలిపి 200 లకు పైగా పాటలు పాడినట్లు వివరించారు. స్లోగా సాగే యుగళ గీతాలు పాడడంలో శ్రీరామ చంద్రది ప్రత్యేక శైలి.

అనేక షోలలో పాల్గొని విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ముఖ్యంగా లతా మంగేష్కర్, పి.బి శ్రీనివాస్, ఘంటశాల, గామా-100, దైనిక్ ప్రయుక్తి వంటి అవార్డులను అందుకున్నాడు. అయితే తాజాగా ఈ కుర్రాడు ఓ షోకు వచ్చాడు. యాంకర్ రీతూ చౌదరి చేస్తున్న దావత్ షోలో పాల్గొన్నాడు. అక్కడే షాకింగ్ కామెంట్లు చేశారుడ. ముఖ్యంగా తన ప్రేమ స్టోరీల గురించి చెప్పాడు. తాను ఏ అమ్మాయి కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసిన సరే ఇట్టే ప్రేమలో పడిపోతారని వివరించాడు.
అంతేకాకుండా ఓ అమ్మాయి తన కోసం నేరుగా తన ఇంటికి ఓ బ్యాగుతో సహా వచ్చేసిందని తెలిపాడు. అయితే తాను తన అభిమాని అని.. ఇంట్లో చెప్పేసి మరీ బ్యాగుతో తన వద్దకు వచ్చేసిందట. కానీ ఆ సమయంలోనే తాను ఇంట్లో లేకపోవడంతో తన తల్లి ఫోన్ చేసి చెప్పిందట. ఈ అమ్మాయి ఎవర్రా, ఎంత చెప్పినా ఇంటికి వెళ్లనంటుందని వివరించిందట. తనకు చాలా భయంగా ఉందని.. అసలు నువ్వు బయట ఏం చేస్తున్నావురా అంటూ గట్టిగా నిలదీసినట్లు స్పష్టం చేశాడు.
అయితే తాను పాటలు పాడుతూ, నటుడిగా కొనసాగుతూ, డబ్బింగ్ కూడా చెప్పడానికి కారణం ఉందని.. తనకు ఖాళీ సమయం ఎక్కువగా ఉండడం వల్లే ఇన్ని పనులు చేయగల్గుతున్నట్లు సింగర్ శ్రీరామ చంద్ర వివరించాడు. ముఖ్యంగా తనకు పెళ్లి కాకపోవడం, ప్రియురాలు కూడా లేకపోవడం వల్లే తాను సక్సెస్ సాధించగల్గినట్లు చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











