కించపరిస్తే సహించను.. వివాదాస్పద కామెంట్స్‌పై సునీత క్లారిటీ

టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సింగర్ ఇటీవల మహిళల దుస్తులు, ఫెమినిజం, మహిళల భద్రతపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆమె వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా "మై బాడీ.. మై రైట్" వ్యాఖ్యపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై సునీత మరోసారి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. ఫెమినిజం అంటే మహిళలు ఏ దుస్తులు వేసుకోవాలనుకున్నా వేసుకోవడం లేదా రాత్రిళ్లు స్వేచ్ఛగా తిరగడం మాత్రమే కాదని అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో ఫెమినిజం అంటే మహిళలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడమేనని చెప్పారు. "మహిళలు, పురుషులు ఒకేలా ఉండరు. ఇద్దరికీ వేర్వేరు శారీరక, మానసిక లక్షణాలు ఉంటాయి. సమానత్వం అంటే ఒకేలా ఉండటం కాదు.. పరస్పర గౌరవం, అవకాశాల్లో సమానత్వం ఉండటం" అని ఆమె వివరించారు.

Singer Sunitha Breaks Silence On Viral Feminism Row Responds After Chinmayi s Reaction

ఇక మహిళల దుస్తులపై సింగర్ సునీత మాట్లాడుతూ.. "మహిళలు 'నా బాడీ.. నా ఇష్టం' అంటున్నారు. కానీ సమాజంలో 'అతని కళ్లు.. అతని ఇష్టం' అనే వాస్తవం కూడా ఉంది. మన సమాజం ఇంకా అంతగా మారలేదు" అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, "ఏం చేస్తున్నామో మనకు తెలుసు. తర్వాత విమర్శలు వస్తే బాధితురాలిలా ప్రవర్తించకూడదు" అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కామెంట్లను పలువురు తప్పుబట్టగా, మహిళల హక్కులను తగ్గించేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

చిన్మయి కౌంటర్..
సునీత వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందిస్తూ.. మహిళల దుస్తులపై మాత్రమే సమాజం ఎందుకు ప్రశ్నలు వేస్తోందని నిలదీశారు. "దుప్పటి కప్పుకున్న మహిళలపై కూడా అత్యాచారాలు జరిగాయి. చిన్నారులపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అయితే ఎందుకు ప్రతిసారి మహిళల దుస్తుల గురించే మాట్లాడుతున్నారు? సమస్య దుస్తుల్లో కాదు.. కొందరు పురుషుల ఆలోచనా విధానంలో ఉంది" అంటూ చిన్మయి అభిప్రాయపడ్డారు.

చిన్మయికి సునీత కౌంటర్
చిన్మయి వ్యాఖ్యల తర్వాత సునీత కూడా స్పందించారు. "చిన్మయి గారంటే నాకు చాలా గౌరవం ఉంది. 'మై బాడీ.. మై విష్' అనే నినాదం వెనుక ఉన్న అసలు ఉద్దేశం నాకు పూర్తిగా తెలుసు. ప్రతి మహిళకు తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుంది. దాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు" అని స్పష్టం చేశారు. అయితే తాను "హిస్ ఐస్.. హిస్ రైట్" అని చెప్పడానికి కారణం ప్రస్తుతం సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితినే గుర్తు చేయడమేనని తెలిపారు. "నా చేతి.. నా ఇష్టం అని చెప్పి ఎవరినైనా కొట్టడం సరైంది కాదు కదా. అలాగే సమాజం ఎలా ఉందో కూడా మనం గుర్తించాలి. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు నేను కూడా బాధితురాలినే. అందుకే మహిళలకు అన్యాయం జరిగితే ఎప్పుడూ మౌనంగా ఉండను" అని పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ
వివాదం మరింత పెరగడంతో సునీత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అధికారిక వివరణ ఇచ్చారు. "నా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కొంతమంది మహిళలను అసభ్యంగా చూసే వ్యక్తుల ప్రవర్తనపై నాకు కలిగిన కోపం, ఆవేదన వల్ల వచ్చినవే. మహిళలను కించపరచడం, వారిపై తీర్పు చెప్పడం, దోపిడీని సమర్థించడం లేదా అలాంటి ప్రవర్తనను ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు" అని స్పష్టం చేశారు. తాను ఒక మహిళగా మహిళల సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవితాన్ని బలంగా విశ్వసిస్తానని సునీత పేర్కొన్నారు. "మహిళలను కించపరిచే లేదా వారికి హాని కలిగించే ఏ చర్యనైనా నేను ఎప్పటికీ సమర్థించను. అలాంటి ప్రవర్తనను సహించను కూడా. నా వ్యాఖ్యలను పూర్తి సందర్భంలోనే చూడాలి. నేను చెప్పని అర్థాలను వాటికి ఆపాదించకండి" అని ఆమె విజ్ఞప్తి చేశారు.

చివరగా తన ఆలోచనల్లో ఎలాంటి మార్పు లేదని సునీత మరోసారి స్పష్టం చేశారు. "సమానత్వం, పరస్పర గౌరవం, మహిళలపై జరిగే దోపిడీ, అన్యాయాల పట్ల జీరో టాలరెన్స్ అనే విలువలను నేను ఎప్పటికీ నమ్ముతాను. అవే నా సిద్ధాంతాలు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ చర్యనైనా నేను వ్యతిరేకిస్తాను" అని తన ప్రకటనలో పేర్కొన్నారు. సునీత వివరణ తర్వాత కూడా సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. కొందరు ఆమె చెప్పిన ఉద్దేశాన్ని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోవాలని అభిప్రాయపడుతుండగా, మరికొందరు మొదట చేసిన వ్యాఖ్యలపై ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళల గౌరవం, సమాన హక్కుల విషయంలో తన అభిప్రాయం ఎప్పటికీ మారదని సునీత మరోసారి స్పష్టమైన సందేశం ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X