For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కూతురు చేసిన పనికి సింగర్ సునీత రియాక్షన్.. వైరల్‌గా మారిన పోస్ట్

  |

  టాలీవుడ్ సింగర్ సునీత అంటే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. తియ్యని గాత్రమే కాదు.. అందమైన రూపం ఆమె సొంతం. చాలు చాలు చాలు సరసాలు చాలు.. అని కొంటెపాటలు పాడినా.. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అంటూ ఎమోషనల్ సాంగ్స్ పాడినా సునీత గాత్రంలో ఉండే మాధుర్యం మిస్ కాదు. అలాంటి సునీత కూతురు శ్రీయ కూడా ఈ మధ్య సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

  డబ్బింగ్‌తో ఫేమస్..

  డబ్బింగ్‌తో ఫేమస్..

  పాటలతో శ్రోతలను అలరించడమే కాకుండా డబ్బింగ్‌తో ఎంతో మంది హీరోయిన్‌లకు గాత్ర ధానం చేసి మెప్పించింది. ఠాగూర్ (జ్యోతిక), చూడాలని ఉంది (సౌందర్య), జయం (సదా), గోదావరి (కమలినీ ముఖర్జీ), హ్యాపీ డేస్ (తమన్నా), కంత్రి (హన్సిక), సింహ (నయనతార), శ్రీరామ రాజ్యం (నయనతార), శ్రీరామ దాసులో స్నేహ పాత్రకు డబ్బింగ్ చెప్పి అందర్నీ ఆకట్టుకుంది.

  కలిసిరాని వైవాహిక బంధం..

  కలిసిరాని వైవాహిక బంధం..

  వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ.. పైకి మాత్రం చిరునవ్వుతోనే కనిపిస్తుంది. సునీతకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె చాలా ఏళ్లుగా అతడికి దూరంగా ఉంటూ వస్తోంది.

   రెండో పెళ్లి అంటూ పుకారు..

  రెండో పెళ్లి అంటూ పుకారు..

  మరో పెళ్లి చేసుకుంటారా.. అనే ప్రశ్న సునీతకు చాలా ఏళ్లుగా ఎదురవుతోంది. దీనికి ఆమె ఎప్పుడూ లేదనే సమాధానం ఇచ్చేవారు. కానీ గత కొన్నాళ్లుగా ఆమె పెళ్లి విషయం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు కాబోయే భర్త ఐటీ కంపెనీ యజమాని అని, ఆయన కూడా ఇదివరకే విడాకులు తీసుకున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి.

   ఖండించిన సునీత..

  ఖండించిన సునీత..

  ప్రస్తుతానికి తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదనీ కుండబద్దలు కొట్టేసింది. తనను అభిమానించి తన బాగు కోరుకునే వారందరికీ ఒకటే చెప్పదల్చుకున్నానని. తాను చాలా ప్రైవేట్ పర్సన్‌ అని చెప్పుకొచ్చింది. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని తానే చెప్పాలని అనుకుంటానని, ఇప్పుడు తానే చెబుతున్నా. అటువంటిది ఏది లేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆపేయండని కోరింది.

  ఆ పాటతో ఎంట్రీ..

  సునీత కుమార్తె కూడా సింగర్ అవతారమెత్తింది. సవ్యసాచి సినిమాలో ఓ పాట పాడి బోణి కొట్టేసింది. అయితే సింగర్‌గానే కాకుండా మంచి మనసున్న మనిషిగా శ్రియా నిరూపించుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ చేస్తూ.. సునీత ఉప్పొంగిపోయింది.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  స్నేహితులతో కలిసి..

  స్నేహితులతో కలిసి..

  ఓ మంచి పనికోసం శ్రియ, ఆమె స్నేహితులందరూ కలిసి లక్ష రూపాయలను పోగు చేసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశారు. ఈ మేరకు సునీత పోస్ట్ చేస్తూ.. ‘నా కూతురిని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ఓ మంచి మనిషిగా ఎదుగుతున్న ఆమెను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. గొప్ప పనిచేశారం'టూ పేర్కొంది.

  English summary
  Singer Sunitha Happy For Her Daughter's Humanity. She Posted That I’m extremely proud of my daughter Shreya..So happy and humbled to see her connecting to noble causes and growing as a good human being. Great job kids.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X