For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Singer Sunitha : ఆ డైరెక్టర్ భార్య తీవ్ర అవమానం, కొట్టాల్సింది కానీ.. రోజంతా ఏడుస్తూనే ఉన్నా!

  |

  తెలుగులో సింగర్ సునీత తెచ్చుకున్న అంత క్రేజ్ మరో సింగర్ తెచ్చుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆమె పాడే పాటల కంటే కూడా ఎక్కువగా వివాదాల్లో మునుగుతూ వచ్చారు. ఆమె తనంతట తాను వివాదాల్లోకి రాకపోయినా ఆమె భర్త నుంచి విడిపోయిన అప్పటి నుంచి ఏదో ఒక అంశంలో ఆమె పేరు లాగుతూ రెండో పెళ్లి వార్తలను ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీత తన జీవితంలో జరిగిన అనేక విషయాలను పంచుకున్నారు. అలాగే ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఇప్పటికీ ట్రోల్స్

  ఇప్పటికీ ట్రోల్స్

  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు పాట తో తొలిసారిగా సింగర్ గా మారిన సునీత ఆ తర్వాత అనేక వందల పాటలు పాడి ఎంతో మంది తెలుగు వారిని తన అభిమానులుగా మార్చుకున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తన అందమైన గొంతుతో ఆమె అనేక సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు..

  అయితే భర్తతో విడిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా జీవితాన్ని గడిపిన సింగర్ సునీత ఈ మధ్యకాలంలో రామ్ అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీ అధినేతను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు. అయితే ఈ వివాహం ఎవరూ ఊహించని విధంగా జరగడంతో ఇప్పటికీ ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి..

  తడి గుడ్డతో గొంతులు కోసే రకాలు

  తడి గుడ్డతో గొంతులు కోసే రకాలు

  అయితే రెండో పెళ్లి తర్వాత తనకు ఎదురైన కొన్ని విషయాలు తాజాగా సునీత ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అదేమిటంటే తనకు రెండో పెళ్లి కాకముందు చాలామంది తనతో మాట్లాడేవారని కానీ పెళ్లయిన తర్వాత వారందరూ ఉన్నట్టుండి మాట్లాడటం మానేశారు అని చెప్పుకొచ్చారు. అయితే ఆ విషయంలో తాను బాధపడటం లేదని కానీ తాను రెండో పెళ్లి చేసుకోవడం చాలా మందికి ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు.

  ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది అనే విషయం కూడా వాళ్లు ఆలోచించడం లేదని తాను పెళ్లి చేసుకోకుండా ఏకాకిగా మిగిలిపోతూ ఉంటేనే వాళ్లకు ఆనందం అని చెప్పుకొచ్చారు. అంతేకాక తను పెళ్ళి చేసుకునే విషయం తన ఇంట్లో వాళ్లకు తెలిస్తే చాలు అని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తన జీవితంలో ఎంతో మంది తడి గుడ్డతో గొంతులు కోసే రకాలను చూశానని చెప్పుకొచ్చారు.

  ఆ డైరెక్టర్ భార్య అలా

  ఆ డైరెక్టర్ భార్య అలా

  ఇక తన కెరీర్ లో ఎన్నో వందల పాటలు పాడానని పేర్కొన్న ఆమె తనకు ఎప్పుడు రెండో పెళ్లి చేశారని తాను ఇప్పుడు చేసుకున్నాను అని అంటూ మీడియా గురించి కామెంట్స్ చేశారు. ఇక నిజానికి అప్పుడప్పుడు తనకు రెండో పెళ్లి చేస్తూనే ఉండేవారని కానీ నేను నేను మాట్లాడే విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకోవడంతో అలాంటి వాళ్లు మరింత రెచ్చిపోయారు అని చెప్పుకొచ్చారు.

  అయితే ఆమె పంచుకున్న ఒక చేదు అనుభవం మాత్రం కాస్త బాధాకరం గానే ఉంది ఎందుకంటే ఒకసారి తాను మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోకి ఒక పాట పాడేందుకు వెళ్లానని అక్కడ ఆ డైరెక్టర్ తన చేతిలో ఉన్న మైక్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు..

  చాలా ఏడ్చా

  చాలా ఏడ్చా

  ఆ మైక్ అందుకుని పాట పాడి వెనక్కి వచ్చేసాను కానీ ఇదంతా గమనిస్తూ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భార్య నా దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావ్ ? నీకు తెలుస్తుందా అంటూ అవమానించేలా ప్రశ్నించారని చెప్పుకొచ్చింది. నేనేం చేశాను అని అడిగితే నువ్వు మైక్ తీసుకునే సమయంలో నీ చేతి వేళ్ళు ఆయనకు తగిలాయి అంటే నీ ఉద్దేశం ఏంటి ? అని ఆమె అడిగింది అని వెల్లడించారు.

  అయితే అప్పటికప్పుడు నా స్టైల్లో నేను ఆమెకు సమాధానం ఇచ్చాను కానీ ఆ ఘటన నన్ను ఎంతగానో బాధకు గురి చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.. ఈ విషయం తెలుసుకుని ఎన్నో రోజులు ఏడ్చాను అని ఇలాంటి ఘటనలు నా జీవితంలో ఎన్నో సార్లు జరిగాయి అని చెప్పుకొచ్చారు.

  చాలా మందిని కొట్టాల్సింది

  చాలా మందిని కొట్టాల్సింది

  ఇక ఆ దర్శకుడి విషయం పక్కన పెడితే తనకు స్టూడియోలో సైతం ఎన్నో సార్లు చేదు అనుభవాలు ఎదురు కాగా కొందరిని కొట్టాల్సిన పరిస్థితుల్లో కూడా కొట్టకుండా వచ్చానని, అది తన బలహీనత అని అన్నారు. ఇలాంటి పనులు చేసినప్పుడు నేను ఎంతో మందిని తిట్టాను అని కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోరని చెప్పుకొచ్చింది.

  ఇక తన భర్త గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన చాలా మంచి మనిషని. నమ్మదగిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. కేవలం ఒకే నెలలో తమ నిశ్చితార్థం పెళ్లి వెంటనే అంటే జరిగిపోయాయని నువ్వు లేకపోతే చచ్చిపోతా అన్న వారిని చూశాను రామ్ ని చూశాను అని వాళ్ల కంటే రామ్ లోని నిజాయితీ తనకు నచ్చిందని చెప్పుకొచ్చారు.

  #HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu
  నేను ఆయనా అంతే

  నేను ఆయనా అంతే

  తన పెళ్లి విషయంలో పిల్లలు స్పందన గురించి చెబుతూ నా పెళ్ళికి నా కంటే వాళ్లే ఎక్కువ ఆలోచించారని ఎంత కాలం ఇలా ఉంటావు ? అమ్మమ్మ వాళ్ళు జీవితాంతం నీకు తోడుగా ఉండరు కదా! అందుకనే నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేవారు అని అన్నారు. తనకు పెళ్లి, పిల్లలు, వివాహం, కుటుంబ విలువలు, కుటుంబ వ్యవస్థ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. ఇక రామ్ తన కుటుంబం మీద ఆధారపడకుండా తనంతట తాను కష్టపడి స్వయం శక్తితో ఎదిగి ఒక సంస్థను స్థాపించాడని, మా ఇద్దరికీ ఉన్న కామన్ క్వాలిటీ ఇద్దరం వర్క్ హాలిక్ అని చెప్పుకొచ్చారు..

  English summary
  In an interview to a popular channel, Sunita shared many things that happened in her life. Also made interesting comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X