Akash Goparaju: రెండో తండ్రిపై సింగర్ సునీత కొడుకు షాకింగ్ కామెంట్లు.. అందుకే ఆయనతో మాట్లాడడట!

టాలీవుడ్ టాప్ సింగర్ సునీత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఈమె.. ఇప్పటికీ సింగర్ గా కొనసాగుతోంది. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చాలా మంది హీరోయిన్లకు గాత్ర దానం చేసింది. కెరియర్ పరంగా దూసుకెళ్తున్న ఈమె.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కుంది. ముఖ్యంగా పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాకా భర్త వదిలేయడంతో ఒంటరిగా ఉంటూనే పిల్లలను పెంచుతూ వచ్చింది.

అయితే తల్లి ఒంటరిగా పడుతున్న కష్టాలను అర్థం చేసుకున్న పిల్లలే దగ్గరుండి తల్లికి రెండో పెళ్లి చేశారు. ప్రముఖ మీడియా కంపెనీ మ్యాంగో అధినేత రామ కృష్ణ వీరపనేని పెళ్లాడింది. అప్పటి నుంచి ఆమె భర్తతో కలిసి ఉంటుండగా.. పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నారు. అయితే ఇప్పటికే వారు చాలా పెద్ద వాళ్లు కావడంతో సునీత కాస్త రిలాక్స్డ్ గా ఉంటోంది. అయితే తాజాగా సునీత కొడుకు ఆకాష్ గోపరాజు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. సర్కారు నౌకరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Singer Sunitha Son Akash Goparaju Shocking Comments His Second Father Rama Krishna Veerapaneni

న్యూ ఇయర్ సందర్భంగా జనవరి ఒకటవ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయింది. అయితే సినిమా కథ బాగున్నప్పటికీ ఇప్పటి కాలానికి చెందినది కాకపోవడంతో థియేటర్ల వద్ద పెద్దగా సందడి చేయట్లేదు. కానీ అద్భుతమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో చిత్రబృందం సఫలం అయింది. ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమా హీరో ఆకాష్ గోపరాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా గురించే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా షాకింగ్ విషయాలు చెప్పారు. ముఖ్యంగా తన తల్లి ఎంతో కష్టపడి తమను పెంచిన తీరును వివరించాడు.

ఎవరికైనా సరే మంచి చేసినా, చెడు చేసినా వెన్ను తట్టే వాళ్లు ఒకరు తోడుగా ఉండాలని.. కానీ తన తల్లి సింగర్ సునీతకు ఏళ్ల పాటు అలాంటి వాళ్లు లేకుండా ఉండడం చాలా లోటు అని చెప్పారు. దాన్ని ఫిల్ చేసేందుకు ఆమెను పెళ్లి చేసుకోమని ప్రోత్సహించామని.. ప్రస్తుతం తన తల్లి చాలా హ్యాపీగా ఉందని పేర్కొన్నారు. తన రెండో తండ్రి రామ్ వీరపనేని గురించి కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయనతో తాను ఎక్కువగా మాట్లాడనని వివిరంచారు. అందుకు కారణాలు కూడా స్పష్టం చేశారు.

 Singer Sunitha Son Akash Goparaju Shocking Comments His Second Father Rama Krishna Veerapaneni

ఆకాష్ గోపరాజు ఇంట్రోవర్ట్ అంట. పెద్దగా ఎవరితోనూ మాట్లాడడట. అలాగే తన రెండో తండ్రి రామ్ వీరపనేని కూడా ఇంట్రోవర్ట్ యేనట. ఈక్రమంలోనే వీరిద్దరూ కలిస్తే అసలు మాటలే ఉండవని.. ఏదైనా పని ఉంటేనే తాము మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో వాళ్లందరూ రామ్ తో బాగానే ఉంటారని కానీ తాను మాత్రం ఎక్కువగా ఇన్వాల్వ్ కానని వివరించాడు. కానీ తనకు రెండో తండ్రి అంటే ఇష్టం అని.. ఆయనతో కలిసి పని చేయడం కూడా తనకు చాలా థ్రిల్ ను ఇస్తుందంటూ మనసులోని భావాలను వెల్లడించాడు హీరో ఆకాష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X